“అరవింద సమేత” 6 రోజుల కలక్షన్స్.. టెన్షన్ లో బయ్యర్లు..

ఎన్.టి.ఆర్, త్రివిక్రం కాంబినేషన్ లో వచ్చిన అరవింద సమేత సినిమా వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తుంది. అక్టోబర్ 11న రిలీజైన ఈ సినిమా సంచలన విజయం అందుకుంది. ఇక ఈ సినిమా 6 రోజుల్లో ఏకంగా 55. 52 కలక్షన్స్ తో జోరు కొనసాగిస్తుంది. తెలుగు రెండు రాష్ట్రాల్లోనే 55 కోట్లు దాటేయగా ఓవర్సీస్ తో కలుపుకుని కలక్షన్స్ లెక్క తెలియాల్సి ఉంది.

అయితే అన్ని ఏరియాల్లో అరవింద సమేత సూపర్ కలక్షన్స్ తో దూసుకెళ్తుంది కాని శ్రీకాకుళం జిల్లాలో మాత్రం ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్స్ కు బాగా దెబ్బేసిందని తెలుస్తుంది. ఉత్తరాంధ్ర భారీ మొత్తానికే అమ్ముడవగా ప్రస్తుతానికి 6.26 కోట్లు మాత్రమే రాబట్టింది. శ్రీకాకుళం తిత్లీ తుఫాను వల్ల అక్కడ భారీ నష్టం జరిగింది. అందుకే అక్కడ సినిమా వసూళ్లు ఏమాత్రం బాగాలేవు.

ఇక ఏరియాల వారిగా అరవింద సమేత 6 రోజుల కలక్షన్స్ చూస్తే..

నైజాం – 15.91
సీడెడ్ – 12.49
నెల్లూరు – 2.08
కృష్ణ – 4.00
గుంటూరు – 6.56
ఉత్తరాంధ్ర – 6.26
ఈస్ట్ – 4.49
వెస్ట్ – 3.73

ఏపి/ తెలంగాణా – 55.52 కోట్లు

Leave a comment