Gossipsమెగా కాంపౌండ్ లో అడుగుపెట్టబోతున్న రష్మిక..!

మెగా కాంపౌండ్ లో అడుగుపెట్టబోతున్న రష్మిక..!

రష్మిక ఈ పేరు ఇప్పుడు టాలీవుడ్ లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. ఇప్పుడు రాబోయే ఏ యంగ్ హీరో సినిమాలో అయినా ముందుగా రశ్మికనే హెరాయిన్ గా ఎంపిక చేయాలని భావిస్తున్నారంటే ఆమె రేంజ్ … ఎక్కడికి వెళ్లిందో చెప్పక్కర్లేదు. దీనికి కారణం గీత గోవిందం విడుదల అయిన తరువాత ఆమెకు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో రష్మికకు విపరీతమైన ఆఫర్లు వస్తున్నట్లు టాక్.మొదటి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టి ప్రేక్షకులను, దర్శక నిర్మాతలను ఆకట్టుకుంది.

రష్మిక ప్రస్తుతం విజయ్ తో డియర్ కామ్రేడ్ చిత్రం చేస్తుంది. దీంతో పాటు మరో రెండు సినిమాలు లైన్లో ఉన్నాయి. ఈ ఆఫర్లు ఇలా ఉండగానే.. ఆమెకు… తమిళ స్టార్ హీరో సినిమాలో అవకాశం వచ్చినట్లు సమాచారం. ఇటీవలే ‘సర్కార్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్ తరువాతి చిత్రం … అట్లీ దర్శకత్వంలో చేసేందుకు సిద్దం అయ్యాడు.ఈ సినిమాలో ముందుగా వేరే హీరోయిన్ లు అనుకున్నా… రష్మిక మందన్న అయితేనే బాగుంటుందని… ఆమెనే… ఎంపిక చేయాలని అట్లీ డిసైడ్ అయ్యాడట.
ఈ ఎంపికపై హీరో విజయ్ కూడా ఒకే చెప్పినట్టు సమాచారం. మరోపక్క దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కితున్న ఆర్ఆర్ఆర్ మల్టీస్టారర్ లో ఒక హీరోయిన్ గా రష్మికను ఎంపిక చేయాలనే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇదే కనుక జరిగితే రాశిమా క టాప్ హీరోయిన్ ల లిస్ట్ లో చేరిపోవడం ఖాయం .

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news