Gossips'మెగా' ఎంట్రీ ఇవ్వబోతున్న పవర్ స్టార్ కొడుకు ...?

‘మెగా’ ఎంట్రీ ఇవ్వబోతున్న పవర్ స్టార్ కొడుకు …?

మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పుడు ఒక్కొక్కరూ బయటకి వచ్చి హీరోగా తమను తాము నిరూపించుకుంటున్నారు. ఆ విధంగానే మెగా అభిమానులు కూడా వారిని ఆరాధిస్తూ వస్తున్నారు. ఇక మెగా హీరోల్లో ఒకడైన పవన్ కళ్యాణ్ గురించి చెప్పేది ఏముంది… ఆయనకు ఇండ్రస్ట్రీలో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు కదా ! ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ కొడుకు అఖీరా కూడా మెగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అయ్యాడట. పూర్తి వివరాలు ఒకసారి పరిశీలిస్తే…

పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ ఈ మధ్య ఓ టీవీ ఛానెల్ కి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ అకిరా బ్లడ్ లోనే యాకింగ్ ఉందని, చిరంజీవి పెదనాన్న , పవన్ కళ్యాణ్ నాన్న అవుతారు కాబట్టి అకిరా లో కూడా అదే రక్తం ప్రవహిస్తోంది కాబట్టి సహజంగానే నటన అకిరా రక్తంలోనే ఉంది కాకపోతే ముందుగా చదువు పూర్తయ్యాకే సినిమాల్లో నటిస్తానంటే ఒపుకుంటాను కానీ చదువు పూర్తిచేయకుండా ఒప్పుకోను అంటూ రేణు చెప్పుకొచ్చింది.

అంతే కాదు …. యుక్త వయసులో ఉన్న అకిరా ఇంకా సినిమాల్లోకి రావాలంటే 5లేదా 6 ఏళ్లకు పైగానే పడుతుంది . ఒకవేళ చదువు ని పక్కన పెట్టి వస్తానంటే కూడా ఏమి చేయలేము . వారసుల రాజ్యం లోకి పవన్ కళ్యాణ్ కొడుకు కూడా రావడానికి సిద్ధం అవుతున్నాడు అని చెప్పకనే చెప్పింది రేణుదేశాయ్. అంటే తొందర్లోనే అకిరా సినిమల్లికి రాబోతున్నట్టు చెప్పకనే చెప్పింది రేణు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news