100 కోట్ల క్లబ్‌లో టెంపర్.. పనిచేసిన తారకమంత్రం!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్‌లో టర్నింగ్ పాయింట్ మూవీ ఏమిటంటే ఠక్కున గుర్తొచ్చే చిత్రం టెంపర్. దర్శకుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో తారక్ మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్‌కు జనాలు ఫిదా అయ్యారు. కాగా ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేశాడు తారక్. అయితే ఇప్పుడు మరోసారి టెంపర్ బాక్సాఫీస్ దగ్గర వంద కోట్ల క్లబ్‌లో జాయిన్ అయ్యి సత్తా చాటింది. అదేంటి.. అప్పుడెప్పుడో వచ్చిన చిత్రం ఇప్పుడు వంద కోట్లు కలెక్ట్ చేయడం ఏమిటి అనుకుంటున్నారా.. అయితే మేటర్‌లోకి వెళ్లాల్సిందే.

టెంపర్‌ చిత్రాన్ని బాలీవుడ్‌లో రణ్‌వీర్ సింగ్ హీరోగా మాస్ చిత్రాల దర్శకుడు రోహిత్ శెట్టి డైరెక్షన్‌లో సింబా అనే పేరుతో రీమేక్ చేయగా ఇటీవల ఈ సినిమా రిలీజ్ అయ్యి మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. కాగా తాజాగా ఈ సినిమా వంద కోట్ల క్లబ్‌లో జాయిన్ అయ్యి మరోసారి మాస్ చిత్రాల సత్తా చాటింది. అటు షారుక్ ఖాన్ చిత్రం జీరో బరిలో ఉన్నప్పటికీ సింబా చిత్రాన్ని చూసేందుకు జనాలు ఎగబడ్డారు. రణ్‌వీర్ పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్‌కు బాలీవుడ్ జనాలతో పాటు సౌత్ ప్రేక్షకులు కూడా పట్టం కట్టారు.

దీంతో మరోసారి తారక్ సినిమా స్టామినా ఏమిటో ప్రేక్షకులకు తెలిసేలా చేశాడు రోహిత్ శెట్టి. ఏదేమైనా బాలీవుడ్ జనాలపై తారకమంత్రం పనిచేసిందని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ చేసుకుంటున్నారు.

Leave a comment