Gossipsబాలకృష్ణ పై నాగబాబు మరి ఇంత నీచంగానా..?

బాలకృష్ణ పై నాగబాబు మరి ఇంత నీచంగానా..?

పవన్ ఎవరో తనకు తెలియదు అన్నందుకు నాగబాబు బాలకృష్ణని టార్గెట్ చేశాడని మాత్రమే అనుకున్నారు. కాని నాగబాబు ఇదవరకు బాలకృష్ణ అన్న అన్ని మాటలకు ఒక్కోదానికి ఒక్కోలా వివరణ ఇచ్చుకుంటూ వస్తున్నారు. నిన్న కామెంట్ 1లో తను ఏదో సరదాగా అంటే అది సీరియస్ గా తీసుకున్నారంటూ చెప్పుకొచ్చాడు. పవన్ ఎవరో తెలియదు అని చెప్పడం ఏంటి లాస్ట్ ఎలక్షన్స్ లో మీ బావతో కలిసి పనిచేశాడు కదా అని మండిపడ్డారు. ఇక

సెకండ్ హామెంట్ లో మీరు మాత్రమే సూపర్ స్టార్ కాదు ఇండస్ట్రీలో చాలామంది సూపర్ స్టార్స్ ఉన్నారంటూ కామెంట్ చేశారు నాగబాబు. ఇక లేటెస్ట్ గా ఈరోజు ఉదయం ఎక్కడో ఆస్ట్రియాలో ఉండే జాతి వివక్ష మీ మాటల ద్వారా వెళ్లడవుతుంది. మీ మాటల్లో మా ప్రస్థావన ఎందుకు.. అమితాబ్ బచ్చన్ ఏం పీకాడు అనడం కరెక్ట్ కాదు. చిరజీవి ఏం సాధించాడు లాంటి మాటలు ఎందుకని మండిపడ్డారు నాగబాబు. అమితాబ్ బచ్చన్ గురించి మాట్లాడే అవసరం ఏముంది. మీ మాటల్లో ఉదహరణగా మా ఫ్యామిలీ పేర్లు ఎందుకని అన్నారు నాగబాబు. మీరు మాలాంటి మనుషులే మా బ్రీడ్ వేరే.. మా రక్తం వేరే అన్న మాటలు మాట్లాడటం పద్ధతి కాదని.. మీరేమి ఆకాశంలోని రాలేదని బాలకృష్ణని మరోసారి టార్గెట్ చేశాడు నాగబాబు.

బాలకృష్ణ ఐదేళ్లుగా ఏం మాట్లాడుతున్నా తాను ఎలాంటు కామెంట్ ఇవ్వలేదని చెప్పిన నాగబాబు ఇప్పుడు ఎందుకు వీటన్నిటిని సేకరించి అటెన్షన్ ఏర్పరుస్తున్నారో మరి. మరి ఎన్ని కామెంట్స్ పెట్టుకున్నాడో ఏమో కాని బాలకృష్ణ చెప్పిన ఒక్కో మాటకి రిప్లై గా ఒక్కో కామెంట్ పెడుతున్నాడు నాగబాబు. ఇప్పటివరకు 3 కామెంట్స్ పెట్టిన నాగబాబు స్టే ట్యూన్ టూ ఫోర్త్ కామెంట్ ఎట్ 9 పి.ఎం అని పెట్టాడు. మరి ఉదయ 9 రాత్రి 9 కరెక్ట్ టైం చూసుకుని మరీ టార్గెట్ చేస్తున్న నాగబాబుని చూస్తుంటే పెద్ద వ్యూహమే పన్నినట్టు ఉన్నారనిపిస్తుంది.

https://youtu.be/GHkeOrK1Ry8

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news