Gossipsక్రేజీ లవర్స్ పెళ్లికి రెడీ అయ్యారట..?

క్రేజీ లవర్స్ పెళ్లికి రెడీ అయ్యారట..?

ఒక సినిమాలో నటించిన హీరో హీరోయిన్ వారి అభిరుచులు కలిశాయని అనిపిస్తే వారి రిలేషన్ కొనసాగిస్తారని తెలిసిందే. ఇప్పటికే టాలీవుడ్ లో నాగ చైతన్య, సమంతలు అలా ఇష్టపడి పెళ్లి చేసుకోగా లాస్ట్ ఇయర్ బాలీవుడ్ లో లవ్ కపుల్స్ వెడ్డింగ్ బెల్స్ మోగాయి. దీపికా, రణ్ వీర్.. ప్రియాంకా, నిక్ జోనాస్ ల పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఇదిలాఉంటే ఇప్పుడు మరో క్రేజీ జంట పెళ్లికి సిద్ధమైనట్టు తెలుస్తుంది. వారెవరో కాదు కోలీవుడ్ హీరో ఆర్య, హీరోయిన్ సయేషా సైగల్ అని తెలుస్తుంది.

ఆర్య, సయేషా సైగల్ ఇద్దరు కలిసి గజినికాంత్ అనే సినిమా చేశారు. ఆ సినిమా తెలుగు భలే భలే మగాడివోయ్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది. సినిమా ఫలితం దెబ్బేసినా సినిమాలో నటించిన హీరో, హీరోయిన్ మాత్రం దగ్గరయ్యారట. కొన్నాళ్లుగా సీక్రెట్ గా నడిపిస్తున్న వీరి ప్రేమ వ్యవహారం ఇప్పుడు కోలీవుడ్ లో హాట్ న్యూస్ అయ్యింది. త్వరలో వీరిద్దరు పెళ్లికి సిద్ధమైనట్టు తెలుస్తుంది. మార్చి 9,10 డేట్స్ లో ఆర్య, సయేషాల పెళ్లి జరుగనుందట.

మొత్తానికి మరో సిని ప్రేమజంట ఒక్కటవబోతుంది. సయేషా సైగల్ అఖిల్ మొదటి సినిమా అఖిల్ లో హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత అమ్మడికి తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. తమిళంలో మాత్రం కార్తి, సూర్య సినిమాల్లో నటించింది. కోలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అయిన ఆర్య ఓ ఇంటివాడు కాబోతుండటం అతని ఫ్యాన్స్ కు ఖుషి అయ్యేలా చేస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news