బిగ్ బాస్ 3 ఎన్టీఆర్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..!

రెండు సీజన్లు సక్సెస్ ఫుల్ గా ముగించుకున్న తెలుగు బిగ్ బాస్ 3వ సీజన్ కు రెడీ అవుతుంది. ఇప్పటికే కంటెస్టంట్స్ వేట మొదలు పెట్టిన బిగ్ బాస్ నిర్వాహకులు వారితో చర్చలు జరుపుతున్నారు. కంటెస్టంట్స్ సైడ్ ఓకే మరి ఇంతకీ బిగ్ బాస్ హోస్ట్ పరిస్థితి ఏంటి అంటే.. రోజుకో స్టార్ పేరు వినపడుతుంది తప్ప బిగ్ బాస్ సీజన్ 3 హోస్ట్ ఎవరన్నది ఇంతవరకు తేలలేదు. బిగ్ బాస్ సీజన్ 1 ఎన్.టి.ఆర్ హోస్ట్ గా చేయగా.. సెకండ్ సీజన్ నాని హోస్ట్ గా చేశాడు.

బిగ్ బాస్ సీజన్ 3 హోస్ట్ గా చిరంజీవి, వెంకటేష్, నాగార్జునల పేర్లు వినపడుతున్నాయి. అయితే వీరెవరు కాదు మళ్లీ ఎన్.టి.ఆరే బిగ్ బాస్ హోస్ట్ గా చేస్తాడని కొందరు అంటున్నారు, సీజన్ 3 హోస్ట్ గా ఎన్.టి.ఆర్ చేస్తానంటే 20 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చేందుకు రెడీ అంటున్నారట బిగ్ బాస్ నిర్వాహకులు. అదే నిజమైతే బిగ్ బాస్ సౌత్ లో తారక్ సెన్సేషనల్ రికార్డ్ సృష్టించినట్టే. అయితే ఆర్.ఆర్.ఆర్ కోసం లాక్ అయిన తారక్ బిగ్ బాస్ హోస్ట్ గా చేస్తడా లేదా అన్నది తెలియాల్సి ఉంది.

ఎన్.టి.ఆర్ హోస్ట్ గా చేస్తే కంటెస్టంట్స్ లిస్ట్ ఎలా ఉన్నా మళ్లీ షో సూపర్ సక్సెస్ అయినట్టే. త్వరలో మొదలవనున్న బిగ్ బాస్ సీజన్ 3 అప్డేట్స్ కొద్దిరోజుల్లో తెలుస్తాయి. ఈసారి కూడా బిగ్ బాస్ హైదరాబాద్ లోనే నిర్వహిస్తున్నారట. ఆల్రెడీ లస్ట్ ఇయర్ వాడిన సెట్ ను కొద్దిగా మార్చి ఈ సీజన్ కు రెడీ చేశారట.

Leave a comment