Newsఅర్జున్ రెడ్డి పై మహిళా సంఘాలు ఫైర్.. స్టేషన్ లో...

అర్జున్ రెడ్డి పై మహిళా సంఘాలు ఫైర్.. స్టేషన్ లో కంప్లైంట్..!

ఈ శుక్రవారం రిలీజ్ అవుతున్న అర్జున్ రెడ్డి సినిమా గురించి అందరు మాట్లాడుతున్నారని చెప్పొచ్చు. అసలే లిప్ లాక్ పొస్టర్స్ తో సంచలనం సృష్టిస్తుండగా నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో విజయ్ దేవరకొండ మాట్లాడిన సెన్సార్ కట్ లేని మాటలకు అందరు ఫైర్ అవుతున్నాడు. హీరో గా తన కాన్ఫిడెన్స్ లెవల్ ఇది అని చెబుతున్న విజయ్ దేవరకొండకు లక్ అనే ఓ ఫ్యాక్టర్ ఉంటుందని తెలియదు కాబోలు అని కామెంట్లు విసురుతున్నారు.

ఇక ఈ సినిమా లిప్ లాక్ సీన్స్ ప్రమోషన్స్ తో రచ్చ చేస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతురావు ఈ లిప్ లాక్ పోస్టర్స్ పై ధ్వజమెత్తగా ఇప్పుడు మహిళా సంఘాలు కూడా ఆ పొస్టర్స్ పై గొడవ మొదలు పెట్టారు. ఈ పోస్టర్స్ పై ఏకంగా సైబరాబాద్ పోలీసులకు కంప్లైంట్ కూడా చేశారట. దీనికి వివరణ ఇచ్చేందుకు అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డిని పోలీసులు పిలిపించారని తెలుస్తుంది.సినిమా రిలీజ్ విషయంలో ఈ కేసు ఏమన్నా ప్రభావం చూపుతుందా అనే విషయంలో కొంత టెన్షన్ వాతావరణం ఏర్పడ్డట్లు తెలుస్తోంది.

ఈ శుక్రవారం రిలీజ్ అవుతున్న ఈ సినిమా మెడికల్ స్టూడెంట్ బ్యాక్ గ్రౌండ్ కథతో వస్తుంది. సినిమాలో హీరో విపరీతమైన కోపం, యాటిట్యూడ్ తో ఉంటాడని ట్రైలర్, టీజర్ చూస్తే తెలుస్తుంది. మొత్తానికి సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news