Moviesబికినీతో , లిప్‌ లాక్ లతో రెచ్చిపోయిన తాప్సీ , జాక్విలైన్...

బికినీతో , లిప్‌ లాక్ లతో రెచ్చిపోయిన తాప్సీ , జాక్విలైన్ (వీడియో)

లిప్‌ లాక్ తో జూడ్వా 2’ మూవీలో తాప్సీ రెచ్చిపోయింది. వరుణ్ ధావన్, జాక్విలైన్, తాప్సీ కాంబినేషన్‌లో రానున్న ఫిల్మ్ ‘జుడ్వా2’ రిలీజ్‌కు రెడీ కావడంతో ప్రమోషన్స్‌లో దూసుకుపోతుంది చిత్రయూనిట్. ‘జూడ్వా 2’ ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. మూడు నిమిషాల నిడివిగల ట్రైలర్‌‌లో యాక్షన్, లవ్, రొమాన్స్, సెంటిమెంట్ అన్నీ ఉండేలా జూడ్వా 2 ట్రైలర్‌ను కట్ చేశారు డైరెక్టర్ డేవిడ్ధా వన్.1997లో సల్మాన్ ఖాన్-కరిష్మాకపూర్ కాంబినేషన్‌లో వచ్చి జూడ్వా మూవీ సంచలన విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే.

ఆ మూవీకి సీక్వెల్‌గా జుడ్వా 2ను తెరకెక్కించారు. ఇందులో వరుణ్ ధావన్ డ్యుయెల్ రోల్ చేస్తున్నారు. ఇదిలాఉంటే తాజా ట్రైలర్‌లో శ్రీలంక బ్యూటీ జాక్విలైన్ తనదైన స్టైల్‌లో అందాలు ఆరబోస్తుంటే.. ఆమెతో పోటీ పడుతూ రెచ్చిపోయి ఎక్స్‌పోజింగ్ చేసింది తాప్సీ. బికినీతో కైపెక్కించే ఫోజులు ఇస్తూ హీరోకి లిప్ లాక్ కూడా ఇచ్చేసింది తాప్సీ. 3 నిమిషాల నివిడిగల ట్రైలర్‌ మొత్తంలో ఈ తరహా లిప్ లాక్‌లు చాలానే ఉండటంతో సినిమా మొత్తంలో ఈ ముద్దుగుమ్మలు రచ్చ ఏంరేంజ్‌లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈ మూవీ ద‌స‌రా కానుక‌గా సెప్టెంబ‌ర్ 29న థియేటర్స్‌లో సందడి చేయనుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news