Moviesఓవర్సీస్ లో అర్జున్ రెడ్డి అదరగొట్టాడు..!

ఓవర్సీస్ లో అర్జున్ రెడ్డి అదరగొట్టాడు..!

విజయ్ దేవరకొండ హీరోగా సందీప్ రెడ్డి డైరెక్ట్ చేసిన సినిమా అర్జున్ రెడ్డి.. లాస్ట్ ఫ్రైడే రిలీజ్ అయిన ఈ సినిమా సంచలన సృష్టిస్తుంది. సినిమా మొదటి రోజు ప్రీమియర్స్ తోనే టాప్ లేపే కలక్షన్స్ సాధించడం విశేషం. తెలుగు రెండు రాష్ట్రాల్లో మూడున్నర కోట్లు కలెక్ట్ చేసిన ఈ సినిమా ఓవర్సీస్ లో ప్రీమియర్ షోలతోనే
2 లక్షల డాలర్లు కలెక్ట్ చేసిందట.

ఇక వీకెండ్ ముగిసే సరికి ఈ సినిమా అక్కడ 1 మిలియన్ మార్క్ చేరుకుందని తెలుస్తుంది. ఫుల్ రన్ లో సినిమా 2 మిలియన్ మార్క్ అందుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అంటున్నారు. చిన్న సినిమాలకు ఓవర్సీస్ లో కాసుల పంట పడుతుంది. కంటెంట్ ఉంటే చాలు అక్కడ ప్రేక్షకులు సినిమాలకు బ్రహ్మరధం పట్టేస్తున్నారు.

ఈమధ్యనే వచ్చిన ఫిదా కూడా అంతే రిలీజ్ ముందు ఎలాంటి హడావిడి లేని వరుణ్ తేజ్, సాయి పల్లవిల ఫిదా రిలీజ్ తర్వాత చేసిన హంగామా తెలిసిందే.
ఫిదా 2 మిలియన్ మార్క్ అందుకోగా ఇప్పుడు ఆ దారిలో అర్జున్ రెడ్డి కూడా అదరగొడుతున్నాడని అంటున్నారు. ఫుల్ రన్ లో ఈ సినిమా కచ్చితంగా 30 కోట్ల పైన కలక్షన్స్ సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు వెళ్లడిస్తున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news