Newsబిగ్ బిగ్ షాకింగ్: టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ కు కూడా ...

బిగ్ బిగ్ షాకింగ్: టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ కు కూడా డ్రగ్స్ లింక్.. కాజల్ మేనేజర్ అరెస్ట్..!

డ్రగ్స్ వ్యవహారంలో టాలీవుడ్ లో కేవలం హీరోలు దర్శకులు మాత్రమే కాదు హీరోయిన్స్ కు లింక్ ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే పూరి, సుబ్బరాజు, శ్యాం కె నాయుడు, నవదీప్, తరుణ్ ల విచారణ జరుగుతుండగా ఈరోజు కాజల్ మేనేజర్ రోనిని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. కొద్ది రోజుల నుండి అతనిపై నిఘా పెట్టగా అతన్ని పోలీసులు అరెస్ట్ చేయడం సంచలనం సృష్టించింది. అంతేకాదు అతని ఇంట్లో పెద్ద మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారట పోలీసులు.

కాజల్ మేనేజర్ గా ఉన్న రోని ఇదవరకు లావణ్య త్రిపాఠి, రాశి ఖన్నాలకు మేనేజర్ గా చేశాడు. అయితే పోలీసులు అతని మీదే నిఘా ఎందుకు పెట్టారు. అతనికి డ్రగ్స్ అలవాటు ఉందా లేదా అన్న విషయాలు ఇంకా బయట పడలేదు. ప్రస్తుతం అతనికి బ్లడ్ టెస్ట్ చేస్తున్నారట. ఇక డ్రగ్స్ కేసులో అనూహ్యంగా వచ్చిన రోని ఎవరి పేర్లు బయటపెడతాడు అన్న విషయంపై సోషల్ మీడియాలో పెద్ద హంగామా జరుగుతుంది. రోని అరెస్ట్ తో డ్రగ్స్ కేసులో హీరోయిన్స్ కాజల్, రాశి ఖన్నా, లావణ్య త్రిపాఠి పేర్లు కూడా తెర మీదకు రావడం గమనార్హం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news