స‌మంత పేరు మార్చుకుందోచ్‌!!

samantha

అంగ‌రంగ వైభ‌వం గా గోవాలో నాగ‌చైత‌న్య‌ని మ‌నువాడిన స‌మంత పెళ్లి సంగ‌తులు అనేకానేకం మీడియాతో చెబుతూనే ఉంది. నాగ్ కూడా కొత్త కోడ‌లి రాక ఇంటికే కొత్త క‌ళ తీసుకువ‌చ్చింద‌ని సంబ‌ర‌ప‌డుతున్నాడు. అంతేనా! సినిమా సంగ‌తులు అటుంచి యావ‌త్ అక్కినేని కుటుంబం సమంతని చూసి మురిసిపోతోంది.

పెళ్లైంది క‌దా ఇంటి పేరు మారిపోవాలి క‌దా.. అందుకే సామాజిక మాధ్య‌మం అయిన ట్విట్ట‌ర్‌లో త‌న ప‌ర్స‌న‌ల్ అకౌంట్ పేరు మార్చుకుంది. సో స‌మంత రూత్ ప్ర‌భుని కాస్త స‌మంత అక్కినేనిగా మార్చింది. కుమారి కాస్త శ్రీ‌మ‌తి అయ్యాక వ‌చ్చిన తొలి మార్పు ఇది. అయితే ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో మాత్రం ఆమె పేరు రుత్‌ ప్రభు అనే ఉంది.కాగా సమంత ప్రధాన పాత్రలో నటించిన ‘రాజుగారి గది 2’ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఇందులో నాగ్ స‌మంత మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు అదిరిపోతాయ‌ని సినీ వ‌ర్గాలు ప‌దే ప‌దే చెబుతున్న మాట‌!ఈ చిత్రంలో సమంత ఆత్మగా కనిపించబోతున్నారు. మెంట‌లిస్ట్ పాత్ర‌లో నాగ్ ప్రేక్ష‌కుల్ని ప‌ల‌క‌రించ‌నున్నారు. మ‌ల‌యాళ ప్రేత‌మ్ ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో త‌న పాత్రే క‌థ‌కు కీల‌కం కానుంద‌ని చెబుతోందీ సోయ‌గం.

More from my site