Gossipsనాగ్ పై బుజ్జీమా ప్ర‌శంస‌లు...

నాగ్ పై బుజ్జీమా ప్ర‌శంస‌లు…

ర‌న్ రాజా ర‌న్ ఫేం సీర‌త్ తాజాగా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. అస‌లీ సినిమా హిట్ త‌రువాత ఈ అమ్మ‌డు వ‌రుస ఛాన్స్‌లు అందుకోవాల్సి ఉన్నా ఎందుకో కెరియ‌ర్  ప‌రంగా వెనుక‌బ‌డి పోయింది. ఆ మ‌ధ్య ఈమె న‌టించిన కొల‌బ‌స్ సినిమా పెద్ద‌గా ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ నోచుకోలేక‌పోయింది. దీంతో కెరియ‌ర్ ఎవ్వ‌రూ ఊహించ‌నంత గ్యాప్ వ‌చ్చేసింది. ఈ తరుణంలో అమ్మ‌డు ఆశ‌ల‌న్నీ  రాజు గారి గ‌ది 2పైనే ఉన్నాయి.

ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ ”రాజుగారి గది 2’లో నా క్యారెక్టర్‌ చాలా సరదాగా ఉంటుంది. ఎక్కడా కష్టం అనిపించదు. అందులోనూ వేరియేషన్స్‌ ఉండే పాత్ర. నిజంగా అలాంటి పాత్ర చేయడం అదృష్టంగా భావిస్తున్నా.ఓంకార్‌ మంచి దర్శకుడు. ఆయనతో పనిచేయడం చాలా బాగుంది. నాగార్జున నుంచి ఎంతో నేర్చుకున్నా.. ఆయ‌న అంద‌రినీ స‌మానంగా గౌర‌విస్తారు” అని చెప్పింది. కాగా త్వ‌ర‌లో ఈ అమ్మ‌డు ర‌వితేజ స‌ర‌స‌న ట‌చ్ చేసి చూడు అనే సినిమాలో తెర‌పంచుకోనుంది.

న‌ట‌న‌తో పాటు ఫొటోషూట్ కి కూడా ప్రాధాన్యం ఇస్తోంది. ఇటీవ‌ల ఆమె పై  చేసిన ఫొటోషూట్  వివాదాస్ప ద‌మైంది.దీనిపై కూడా ఆమె వివ‌ర‌ణ ఇచ్చింది. మహిళ ఎంత బలంగా ఉండగలదో చెప్పే ఫీలింగ్స్ ఆ ఫొటోలో కనిపిస్తాయి అని, ఆ విధంగానే వాటిని చూడాల‌ని, అంతేకానీ త‌న వ‌స్త్ర‌ధార‌ణపై కామెంట్ చేయ‌డం త‌గ‌ద‌ని అభిప్రాయ‌ప‌డింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news