Gossipsసుకుమార్ ఆలోచనల్లో రంగస్థలం-2 హీరో చరణా..? ఎన్టీఆరా..!

సుకుమార్ ఆలోచనల్లో రంగస్థలం-2 హీరో చరణా..? ఎన్టీఆరా..!

రంగస్థలం సినిమాతో సూపర్ హిట్ అందుకున్న సుకుమార్ తన కెరియర్ ఆర్య తర్వాత ఆ రేంజ్ ఫాలోయింగ్ క్రేజ్ తెచ్చుకున్న సినిమా ఇదని చెప్పొచ్చు. ఎన్.టి.ఆర్ నాన్నకు ప్రేమతో హిట్ అనిపించుకున్నా కమర్షియల్ గా బాక్సాఫీస్ మోతమోగించే సినిమా రాలేదని చెప్పాలి. అందుకే రంగస్థలం హిట్ ను సుకుమార్ బాగా ఎంజాయ్ చేస్తున్నాడు.

ఇక ఈ సినిమా సక్సెస్ జోష్ లో ఉన్న సుకుమార్ రంగస్థలం పార్ట్-2 కూడా తీస్తారా అంటే మాక్సిమం చేసే అవకాశం ఉందని అంటున్నాడు. రాం చరణ్ హీరోగా వచ్చిన రంగస్థలం సినిమా చరణ్ వన్ మ్యాన్ షోతో సర్ ప్రైజ్ చేసింది. ఇక రంగస్థలం పార్ట్-2లో చరణ్ హీరోగా ఉంటాడా లేక ఎన్.టి.ఆరా అన్నది తెలియాల్సి ఉంది.

రంగస్థలం కోసం ఏడాది నుండి కష్టపడుతున్న సుకుమార్ ప్రస్తుతం కొద్దికాలం ఫ్యామిలీతో టైం స్పెండ్ కేటాయిస్తాడని అంటున్నారు. ఇక తన తర్వాత సినిమా మాత్రం మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ఉంటుందని చెప్పిన సుకుమార్ ఆ తర్వాత తన నిర్మాణంలో కూడా ఓ సినిమా చేస్తాడని అంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news