Gossipsబన్ని కోసం రాం చరణ్.. మెగా హంగామా షురూ..!

బన్ని కోసం రాం చరణ్.. మెగా హంగామా షురూ..!

మెగా హీరోల మధ్య దూరం పెరిగింది అన్న వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టేలా ప్రస్తుత కార్యచరణలు జరుగుతున్నాయని తెలుస్తుంది. ఇప్పటికే పవన్ ఇష్యూ మీద అందరు స్పదించారు ఫ్యాన్స్ దాన్ని గమనిస్తూనే ఉన్నారు. పవన్, అల్లు అర్జున్ మధ్య దూరాన్ని సైతం ఈ గొడవ వల్ల దగ్గరయ్యారు. ఏకంగా నా పేరు సూర్య ఆడియోలో పవన్ గురించి చాలా హర్ట్ అయ్యా అని ఆయనకు తన స్ట్రాంగ్ మద్ధతు తెలిపాడు అల్లు అర్జున్.

ఇక ఇప్పుడు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రెడీ అవుతున్నారు. మే 4న రిలీజ్ అవుతున్న నా పేరు సూర్య సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఏప్రిల్ 29న హైదరాబాద్ గచ్చిబౌలిలో జరుపనున్నారు. ఈ వేడుకకు మెగాస్టార్, పవర్ స్టార్ వస్తారని అన్నారు. కాని మెగా పవర్ స్టార్ ఒక్కడే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.

ఈవెంట్ సినిమాదే అయినా అక్కడ కచ్చితంగా రాం చరణ్ పవన్ పై జరుగుతున్న గొడవ మీద మాట్లాడక తప్పదు. కచ్చితంగా ఆ విధంగానే ప్రిపేర్ అయ్యి వస్తున్నాడని టాక్. మొత్తానికి పవన్ మీద బురదజల్లేలా చేస్తున్న కొందరు పని పట్టేందుకు పవన్ ఒక్కడు కాదు మేమంతా తన వెనుక ఉన్నామని సరైన టైం లో ముందుకొచ్చారు మెగా హీరోలు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news