Moviesభరత్ అనే నేను పై రాజమౌళి షాకింగ్ ట్వీట్

భరత్ అనే నేను పై రాజమౌళి షాకింగ్ ట్వీట్

సూపర్ స్టార్ మహేష్ భరత్ అనే నేను సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని వసూళ్ల హంగామా సృష్టిస్తుంది. ఇక ఈ సినిమా చూసిన సెలబ్రిటీస్ సైతం సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ముఖ్యంగా కమర్షియల్ సినిమా స్టార్ హీరో సినిమాను ఓ మంచి మెసేజ్ సినిమాగా మలచిన తీరు అద్భుతమని అంటున్నారు.
ఇప్పటికే సినిమా గురించి రాజమౌళి ట్వీట్ చేయగా.. యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ భరత్ అనే నేనుపై తన స్పందన తెలియచేశాడు. సామాజిక బాధ్యతను కమర్షియల్ పంథాలో చెప్పిన కొరటాల శివ కు కుదూస్ అని ట్వీట్ చేసిన తారక్ మహేష్ నటన అద్భుతమని అన్నాడు. ఇది ఓ రిమార్కబుల్ మూవీ అని.. నిజాయితిగల సినిమా అని కొనియాడారు.
ఓ స్టార్ హీరో సినిమాను మరో స్టార్ హీరో ఇంతగా పొగడటం అది కేవలం ఎన్.టి.ఆర్ వల్లే అని చెప్పొచ్చు. భరత్ అనే నేను ప్రీ రిలీజ్ ఈవెంట్ కు కూడా ఎన్.టి.ఆర్ చీఫ్ గెస్ట్ గా వెళ్లారు. కొరటాల శివ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను డివివి దానయ్య నిర్మించారు.
మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news