Gossipsనాని 'కృష్ణార్జున యుద్ధం' కథ అదిరిపోయింది..!

నాని ‘కృష్ణార్జున యుద్ధం’ కథ అదిరిపోయింది..!

నాచురల్ స్టార్ నాని నిన్ను కోరి తర్వాత చేస్తున్న సినిమా ఎం.సి.ఏ. దిల్ రాజు బ్యానర్లో వస్తున్న ఈ సినిమాను ఓ మై ఫ్రెండ్ డైరక్టర్ వేణు శ్రీరాం డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత ఎక్స్ ప్రెస్ డైరక్టర్ మేర్లపాక గాంధి డైరక్షన్ లో మూవీ ఫిక్స్ చేశాడు నాని. సినిమా టైటిల్ గా కృష్ణార్జున యుద్ధం అని పెట్టారు.

సినిమాలో డ్యుయల్ రోల్ చేస్తున్న నాని కృష్ణ, అర్జున్ పాత్రల్లో కనిపిస్తాడని తెలుస్తుంది. ఇక ఈ సినిమా కథ ఇదే అంటూ ఫిల్మ్ నగర్ లో హడావిడి చేస్తున్నారు. కృష్ణ, అర్జున్ లుగా రెండు పాత్రల్లో నటిస్తున్న నాని ఒకరు తిరుపతిలో మాస్ పాత్రలో.. మరొకరు ప్యారిస్ లో క్లాస్ పాత్రలో కనిపిస్తారట. వీరి జీవితాల్లో ఓ యూనిక్ ట్విస్ట్ ఇద్దరిని ఒక సందర్భంలో కలిపి మరొక సందర్భంలో వేరు చేస్తుందట.

సినిమా లైన్ వింటుంటే ఇదేదో హలో బ్రదర్ కథగా ఉంది కదా.. కాస్త అటు ఇటుగా అలానే అనిపిస్తున్నా నాని మార్క్ కామెడీ.. ఎంటర్టైనింగ్ తో సినిమా ఉంటుందని తెలుస్తుంది. ఇప్పటికే జెండాపై కపిరాజు, జెంటిల్మన్ సినిమాలలో డ్యుయల్ రోల్ చేసిన నాని కృష్ణార్జున యుద్ధంలో ఎలా కనిపిస్తాడో చూడాలి. త్వరలో స్టార్ట్ అవుతున్న ఈ సినిమా 2018 మొదట్లోనే రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news