Newsఅక్కినేని హీరో ఈసారి గురి తప్పదంటున్నాడు..!

అక్కినేని హీరో ఈసారి గురి తప్పదంటున్నాడు..!

అక్కినేని ఫ్యామిలీ నుండి హీరోగా వచ్చిన సుమంత్ ఆ ఫ్యామిలీ అభిమానులను అలరించలేకపోయాడు. దశాబ్ధ కాలానికి పైగానే హీరోగా ఎంట్రీ ఇచ్చినా సరే ఇప్పటికి కెరియర్ లో సరైన హిట్ పడలేదు అంటే నమ్మాలి. సత్యం, గోదావరి సినిమాలు ఏదో అలా ఆడేశాయి. సినిమాల ఫలితాలతో సంబంధం లేకుండా వరుసగా చేసుకుంటూ వస్తున్నాడు సుమంత్.

సినిమా సినిమాకు కాస్త గ్యాప్ తీసుకుంటున్నా సరే కొత్త ఎనర్జీతో కనిపిస్తాడు. లాస్ట్ ఇయర్ నరుడా డోనరుడా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సుమంత్ కాస్త హడావిడి చేసినట్టు కనిపించినా ఫైనల్ గా బాక్సాఫీస్ వద్ద మాత్రం బోల్తా కొట్టాడు. ఇక మళ్లీ సంవత్సరం గ్యాప్ తీసుకుని ఈసారి ఏకంగా సినిమా పూర్తి చేసుకుని వార్తల్లోకి వచ్చాడు.

సుమంత్ ప్రస్తుతం చేస్తున్న సినిమా ‘మళ్లీ రావా’.. గౌతం అనే కొత్త దర్శకుడు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు సుమంత్. మూడు జెనరేషన్స్ లో ప్రేమకథలను చెప్పబోతున్నట్టు సినిమా గురించి చెప్పుకొచ్చారు. సుమంత్ కాన్ఫిడెన్స్ చూస్తుంటే ఈసారి గట్టిగానే కొట్టేలా ఉన్నాడనిపిస్తుంది. మరి హిట్ కొట్టాలన్న సుమంత్ ఆశ మళ్లీ రావా సినిమా అయినా నెరవేరుస్తుందో లేదో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news