Newsనాగబాబు సూపర్ ట్విస్ట్.. సిక్స్ ప్యాక్ కోసం కసరత్తు

నాగబాబు సూపర్ ట్విస్ట్.. సిక్స్ ప్యాక్ కోసం కసరత్తు

Do you know, mega brother Nagababu tried for six pack. Yes, in the recent interview nagababu has revealed this shocking secret. Read the below story why he tried for abs and when.

అవును.. మీరు చదువుతోంది అక్షరాల నిజం. ఇంతవరకు ఏ ఒక్కరూ ఊహించని పనిని మెగాబ్రదర్ నాగబాబు చేశాడు. సిక్స్ ప్యాక్ కోసం కొన్ని నెలలపాటు తీవ్రంగా శ్రమించాడు. అయితే.. ఆయన కసరత్తు చేసింది ఇప్పుడు కాదులెండి, ‘ఆరెంజ్’ సినిమా ఘోరంగా విఫలమైన తర్వాత ఈ ప్రయత్నం చేశాడట. ఈ విషయాన్ని తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన స్వయంగా వెల్లడించాడు.

‘అంజనా ప్రొడక్షన్స్’ బ్యానర్‌పై నాగబాబు తొలిసారిగా రామ్ చరణ్‌తో దాదాపు రూ.40 కోట్ల బడ్జెట్‌తో ‘ఆరెంజ్’ సినిమా తీస్తే.. అది దారుణంగా పరాజయం పాలయ్యింది. ఆ దెబ్బతో నాగబాబుకి సగానికి నష్టం వచ్చింది. దీంతో.. తీవ్ర మనోవేదనకు గురైన ఆయన.. ఏం చేయాలో తెలియక అయోమయంలో పడిపోయాడట. ఆ డిప్రెషన్ నుంచి ఎలాగైనా బయటపడాలని అనుకుంటున్న సమయంలో.. విచిత్రంగా తాను సిక్స్ ప్యాక్ కోసం ప్రయత్నం చేశానని తెలిపాడు. ఆ ఆలోచన తట్టిన మరుక్షణమే జిమ్‌కి వెళ్ళడం ప్రారంభించానని, కొన్ని నెలలపాటు రెగ్యులర్‌గా వెళ్లి, యాబ్స్ కూడా తెచ్చుకున్నానని వెల్లడించాడు. అయితే.. ఫినిషింగ్ టచ్ ఇవ్వకుండానే ఆ కష్టానికి తెరదించానని ఆయన పేర్కొన్నారు. అప్పటికే ‘ఆరెంజ్’ ఫెయిల్ అయిందన్న డిప్రెషన్ నుంచి బయటికి వచ్చేయడం వల్లే ఆ ప్రయత్నం విరమించుకున్నానని నాగబాబు స్పష్టం చేశాడు.

సాధారణంగా ఎవరైనా డిప్రెషన్‌కి గురైతే.. గదిలో తమనితాము నిర్బంధించుకోవడం కోవడంగానీ, ఎక్కడైనా దూరప్రాంతాలకు వెళ్ళిపోవడం గానీ చేస్తారు. ఇంకొందరు పిరికివాళ్లైతే సూసైడ్‌కి పాల్పడుతారు. కానీ.. నాగబాబు మాత్రం విచిత్రంగా సిక్స్ ప్యాక్ కోసం కసరత్తు చేసి అందరికీ దిమ్మతిరిగేలా చేశాడు. అప్పట్లో 50 ఏళ్లకు దగ్గరవుతున్న సమయంలో సిక్స్ ప్యాక్ చేయడమంటే.. ఆశ్చర్యకరమైన విషయమే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news