ఆ హీరో సమంతకి నరకం చూపించాడట.. అందుకే!

samantha shocking comments on siddhartha

Chennai beauty Samantha has made sensational comments on a hero who has lover boy fame in south industry. Once upon a time both ther are very good friends, but suddenly they split. Now, she opens up about that relationship and what she faces problems.

గతంలో ట్విటర్ వేదికగా చెన్నైబ్యూటీ సమంత ఎన్నో సంచలన వ్యాఖ్యలు చేసింది కానీ.. ఏ ఒక్కరిమీదా ఆరోపణలు చేసిన దాఖలాలు లేవు. ఇండస్ట్రీలో ఉన్నవారందరూ తనకు మంచి స్నేహతులేనని, ఎవరితోనూ విభేదాలు లేవని కొన్ని సందర్భాల్లో వెల్లడించింది కూడా. అలాంటి ఈ అమ్మడు.. తాజాగా ఓ హీరో మీద షాకింగ్ కామెంట్స్ చేసింది. అతని పేరు వెల్లడించలేదు కానీ.. పరోక్షంగా మాత్రం తన మనసులో దాచుకున్న ఆవేదనని అతనిపై విమర్శల రూపంలో వెళ్లగక్కింది. రీసెంట్‌గా ఓ టీవీ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఆ హీరోపై మండిపడింది.

అప్పట్లో ఓ హీరో వల్ల తాను నరకం చూశానని, అతడు చాలా ఇబ్బంది పెట్టాడని సమంత పేర్కొంది. నిత్యం అతడు పెట్టే ఇబ్బందులు తాళలేక.. తప్పనిసరి పరిస్థితుల్లో అతనితో స్నేహం చేయాల్సి వచ్చిందని ఆమె చెప్పింది. కొన్నాళ్లు ఎలాగోలా అడ్జస్ట్ అయ్యానని, చివరికి తనవల్ల కాదనుకుని అతని నుంచి దూరమయ్యేందుకు ప్రయత్నించానని వెల్లడించింది. ఆ సమయంలో తాను ఎంతో కుంగిపోయానని, అప్పుడు చైతూ తన లైఫ్‌లోకి ఎంట్రీ ఇచ్చి భరోసా ఇచ్చాడని, దాంతో తాను అతనికి దగ్గర కాగలిగానని ఈ అమ్మడు తెలిపింది. చైతూ ఇచ్చిన భరోసా కారణంగానే తాను ఈరోజు చాలా దృఢంగా ఉన్నానని చెప్పుకొచ్చింది.

సమంత నేరుగా ఆ హీరో పేరు వెల్లడించలేదు కానీ.. ఆమె చేసిన కామెంట్స్ బట్టి చూస్తే ఆ హీరో సిద్ధార్థే అని గుసగుసలు వినబడుతున్నాయి. దానికి కారణం లేకపోలేదు. గతంలో ఈ ఇద్దరు కొన్నాళ్లు డేటింగ్ చేశారు. ఎక్కడపడితే అక్కడ చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. పైగా.. శ్రీకాళహస్తిలో పూజలు కూడా చేశారు. ఒకానొక సమయంలో పెళ్ళికి కూడా సిద్ధమయ్యారులెండి. ఆ తర్వాత విడిపోయారు.