‘ఖైదీ నెం.150’ ఫస్ట్ డే కలెక్షన్స్.. హిస్టారికల్ రికార్డ్ తప్పదంటున్న ట్రేడ్ వర్గాలు

khaidi no 150 first day collections estimations chiranjeevi

Trade analysts make a report on Khaidi No 150 first day collections on the basis of buzz. According to
their analysis, this movie will break baahubali the begining first day record.

తారాస్థాయి అంచనాలతో జనవరి 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న మెగాస్టార్ చిరంజీవి మైల్‌స్టోన్ మూవీ‘ఖైదీ నెంబర్ 150’ తొలిరోజు బాక్సాఫీస్‌ని ఓ కుదుపు కుదిపేయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.

తమిళంలో భారీ విజయం సాధించిన ‘కత్తి’ చిత్రానికి ఇది రీమేక్ కావడంతోపాటు చిరంజీవి సినిమాలకు దూరమై దాదాపు దశాబ్దకాలం అవుతున్నా ఇంకా ఆయన ఇమేజ్ చెక్కు చెదరకుండా ఉండడం వంటి అంశాలు ఈ చిత్రానికి బోలెడంత క్రేజ్ తెచ్చిపెట్టాయి. పైగా.. ఈ సినిమాని గతంలో మునుపెన్నడూ లేని విధంగా ప్రపంచవ్యాప్తంగా భారీఎత్తున రిలీజ్ చేస్తుండడం.. అన్ని ఏరియాల్లోనూ ఈ సినిమాపై నెలకొన్న బజ్‌ని బట్టి.. ఈ చిత్రం తొలిరోజు ఎంత కలెక్ట్ చేస్తుందో ట్రేడ్ వర్గాలు ఓ రిపోర్ట్‌ని తయారు చేశాయి.

ట్రేడ్ లెక్కల ప్రకారం.. ఫస్ట్ డే ‘ఖైదీ’ సినిమా రూ.25-28 కోట్ల మధ్య కలెక్షన్లు రాబట్టవచ్చునని అంచనా వేస్తున్నారు. అంటే.. ‘బాహుబలి’ (రూ.23.4 కోట్లు) రికార్డ్ కూడా మెగాస్టార్ స్టామినా ముందు కొట్టుకుపోవడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు. మరి.. ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం ఈ చిత్రం అంతమొత్తం కలెక్ట్ చేస్తుందా? లేదా? చూడాలి.

More from my site