Moviesబాలయ్యతో పోటీపై చిరంజీవి చేసిన కామెంట్స్‌కి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే!

బాలయ్యతో పోటీపై చిరంజీవి చేసిన కామెంట్స్‌కి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే!

Megastar Chiranjeevi talks about clash with Balayya in Sankranti at boxoffice after a long time.

సాధారణంగా ఇద్దరూ స్టార్ హీరోల సినిమాలు ఒకేసారి విడుదలయ్యే ప్రతిసారీ.. వారి అభిమానుల మధ్య తారాస్థాయిలో పోటీ నెలకొంటుంది. తమ హీరో సినిమానే విజయం సాధిస్తుందంటే.. లేదు తమ హీరో మూవీనే ప్రభంజనం సృష్టిస్తుందని సోషల్ మీడియాలో నానాహంగామా చేస్తారు. ఇప్పుడు చిరంజీవి, బాలయ్య ప్రతిష్టాత్మక చిత్రాలు సంక్రాంతి కానుకగా విడుదల అవుతుండడంతో.. ఫ్యాన్స్ మధ్య పోటీ వాతావరణం మరింతగా పెరిగింది. పైగా.. ఆ ఇద్దరి లెజెండ్స్ సినిమాలు మైలురాయిల్లాంటి (150, 100) కావడంతో, సామాజిక మాధ్యమాల్లో ఫ్యాన్స్ హడావిడి అంతాఇంతా లేదు. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఈ పోటీపై ఇండస్ట్రీలో మునుపెన్నడూలేని రచ్చ జరుగుతోంది.

అయితే.. బాలయ్య, చిరులు మాత్రం ఈ పోటీని ఏమాత్రం పట్టించుకోకుండా స్నేహమంత్రం జపిస్తున్నారు. తమ రెండు సినిమాలతోపాటు సంక్రాంతికి విడుదల అవుతున్న ఇతర సినిమాలు కూడా బాగా ఆడాలని కోరుకుంటున్నారు. ఇక తమ పోటీపై కూడా పాజిటివ్‌గానే స్పందిస్తున్నారు. తాజాగా చిరు కూడా ఓ పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా మెచ్యూర్డ్‌గా బాలయ్యతో పోటీపై స్పందించారు. ‘నాకెప్పుడూ పోటీ అనేది లేదు. అయితే.. నా 150వ సినిమా, బాలకృష్ణ 100వ మూవీ ఒకేసారి రిలీజ్ అవుతుండడంతో మీడియానే పోటీని క్రియేట్ చేసింది. అయినా.. మేమిద్దరం కూడా కావాలనే పోటీగా మా సినిమాల్ని రిలీజ్ చేయాలని ప్లాన్ చేయలేదు. కాకతాళీయంగా జరిగిపోయిందంతే’ అని చిరు అన్నారు.

ఇక బాలయ్యతో ఉన్న ఈక్వేషన్స్ గురించి చిరు మాట్లాడుతూ.. ‘గౌతమీపుత్ర శాతకర్ణి ఓపెనింగ్‌కి నేను కూడా వెళ్ళాను.. ఆ సినిమాకి నేను కెమెరా స్విచ్చాన్ చేశా.. అలాంటి కథాంశాల్ని ఎంచుకోవడమే సగం సక్సెస్. నా మిత్రుడైన బాలయ్య సినిమా మంచి విజయం సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకొంటున్నా’ అని చెప్పుకొచ్చారు. అటు బాలయ్య కూడా ఈ విధంగానే చిరు సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఇలా ఉంటున్నారు కాబట్టే.. వీరిద్దరూ లెజెండ్స్ అయ్యారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news