Moviesఅయ్యా బోయపాటి ఏంటా కొట్టుడు.. ఊర మాస్ ట్రైలర్ తో వేడెక్కించాడు

అయ్యా బోయపాటి ఏంటా కొట్టుడు.. ఊర మాస్ ట్రైలర్ తో వేడెక్కించాడు

టాలీవుడ్ సెన్సేషనల్ డైరక్టర్ బోయపాటి సినిమా అంటే తెలుగు ఆడియెన్స్ కు ఓ లెక్క ఉంటుంది. ఊర మాస్ ఆడియెన్స్ ను విజిల్ వేసి మరి రచ్చ చేసే సినిమాలను తీసే బోయపాటి సినిమా సినిమాకు తనలోని మాస్ ప్రతిభతో రెచ్చిపోతున్నాడు. సరైనోడు తర్వాత ఎలాంటి అంచనాలు లేని బెల్లంకొండ శ్రీనివాస్ తో జయ జానకి నాయకా సినిమా ఎనౌన్స్ చేసి సర్ ప్రైజ్ చేసిన బోయపాటి ఆ సినిమా టీజర్ తో కొంత షాక్ అయ్యేలా చేశాడు.

ఇక ఈరోజు ఆడియో సందర్భంగా రిలీజైన ఈ సినిమా ట్రైలర్ తో మరోసారి బోయపాటి తన సత్తా చాటాడు. కటౌట్ ఎలా ఉన్నా సరే బోయపాటి హీరో అంటే ఆ కొట్టుడు అదోరకంగా ఉంటుంది అన్నట్టు శత్రు సంహారం చేస్తున్న బెల్లంకొండ బాబు అదరగొట్టేశాడు అనాలి. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా సినిమాకు మేజర్ హెల్ప్ అయ్యే అవకాశం కనబడుతుంది. అంతేకాదు సినిమాలో ప్రగ్యా జైశ్వాల్ తో పాటుగా ఐటం సాంగ్ కోసం కేథరిన్ ను కూడా వాడేశారు.

ప్రేక్షకులకు మరోసారి ఊర మాస్ సినిమాతో విందు భోజనం పెట్టేందుకు వస్తున్న బోయపాటి శ్రీను జయ జానకి నాయకాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకుంటాడని లెక్క చెప్పి మరి వస్తున్నాడు. ఆగష్టు 11న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాను మిర్యాల రవిందర్ రెడ్డి నిర్మించారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news