Moviesపాదయాత్ర చేసిన జగపతిబాబు .. ఎందుకో తెలుసా..? 

పాదయాత్ర చేసిన జగపతిబాబు .. ఎందుకో తెలుసా..? 

పాదయాత్రలు చెయ్యడం ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయినట్టు ఉంది. ఒక పక్క రాజకీయ నాయకులు పాదయాత్రలు చేసి జనాల్లో తిరగేస్తుంటే.. ప్రజల్లో పాపులారిటీ బాగా  పెరిగిపోతోంది. అయితే ఆ పాపులారిటీ రాజకీయ నాయకులకేనా మాకు వద్దా అనుకున్నారో ఏమో కానీ ఇప్పడు సినిమా స్టార్లు కూడా పాదయాత్రల ట్రెండ్ ఫాలో అయిపోతున్నారు.

చేతినిండా సినిమాలతో చాలా బిజీగా ఉన్న జగపతిబాబు ఉన్నట్టుండి పాదయాత్ర ట్రెండ్  మొదలెట్టాడు. చిన్న సినిమాలకు మద్దతుగా పాదయాత్ర చేస్తున్నాడు. ఈమధ్య విశాఖపట్నం బీచ్ రోడ్డులో హఠాత్తుగా ప్రత్యక్షమై జనాలతో కలిసి నడుచుకుంటూ వెళ్లాడు . తాజాగా విజయవాడ లో ఫుల్ రష్ గా ఉండే కాళేశ్వరరావు మార్కెట్ ఏరియాలో పాదయాత్ర చేశాడు.

https://youtu.be/Y6GNWCZ4Yn4

ఇండస్ట్రీకి వస్తున్న కొత్త హీరో హీరోయిన్లను ప్రోత్సహించేందుకే ఈ పాదయాత్ర చేస్తున్నట్లు చెప్పాడు. చిన్న సినిమాలు అంతరించిపోకుండా విజయాలు సాధించాలన్న కోరికతో నడుస్తున్నానని చెప్పుకొచ్చాడు ఇండస్ర్టీలో పెద్దోళ్లు ఇంకా పెద్దోళ్లవుతున్నారని, చిన్నోళ్లు మరింత చిన్నోళ్లయిపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.

మనకు చాలామంది నటీనటులేకాదు, తక్కువ బడ్జెట్‌తో మంచి సినిమాలు తీయగల యంగ్ డైరెక్టర్స్ వున్నారని తెలిపాడు. తెల్లచొక్కా తెల్లపంచె ధరించి రోడ్ల వెంట నడుచుకుంటూ వెళ్తున్న జగపతిబాబును చూసిన అభిమానులంతా ఆయన వెంట పరుగులు తీశారు.

 

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news