అక్కడ రెచ్చిపోతే ఇక్కడ అవకాశాలొస్తాయా..!

తెలుగులో కొన్నాళ్లుగా క్రేజీ హీరోయిన్ గా ఉన్న రెజినా స్టార్స్ తో మాత్రం అవకాశాలను దక్కించుకోలేకపోయింది. కుర్ర హీరోలకు పర్ఫెక్ట్ పెయిర్ అనిపించేలా ఉండే రెజినా కొత్తా పాతా తేడా లేకుండా అందరితో నటించేస్తుంది. ఇక తెలుగులోనే కాదు తమిళంలో కూడా అమ్మడు సినిమాలు చేస్తుంది. అయితే ఈమధ్య అమ్మడి బ్యాడ్ లక్ వల్ల చేసిన సినిమాలన్ని బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొడుతున్నాయి.

ప్రస్తుతం చేతిలో నారా రోహిత్ బాలకృష్ణుడు ఒకటే ఉంది. అది కూడా ఈ శుక్రవారం రిలీజ్ అవుతుంది. అయితే ప్రస్తుతం అమెరికాలో ఈవెంట్ లలో పాల్గొనేందుకు వెళ్లిన రెజినా అక్కడ అందాల ప్రదర్శనతో అందరిని ఆకట్టుకుంటుంది. అమ్మడు రెచ్చిపోవడం చూస్తుంటే అమెరికా ఆడియెన్స్ ను బుట్టలో వేసుకోవాలన్నట్టు ఉంది. ఈవెంట్ లోనే కాదు కాజువల్ మీటింగ్స్ లో కూడా రెజినా రెచ్చిపోవడం చూస్తుంటే దర్శక నిర్మాతలకు ఏదో హిట్ ఇస్తున్నట్టు ఉంది.

మరి రెజినాలోని ఈ హాట్ యాంగిల్ ఏ దర్శకుడు వాడుతాడో కాని ఈ దెబ్బతో అమ్మడికి హాట్ ఇమేజ్ సొంతం చేసుకోవాలని చూస్తుంది. రెజినా చేసే ఈ ప్రయత్నాలు ఆమెకు ఏమాత్రం క్రేజ్ వచ్చేలా చేస్తాయో చూడాలి.

 

Leave a comment