Newsబన్నీ పేరు బయటపెట్టిన సంచలనాల హీరోయిన్ శ్రీ రెడ్డి !!

బన్నీ పేరు బయటపెట్టిన సంచలనాల హీరోయిన్ శ్రీ రెడ్డి !!

వారం రోజులుగా సోషల్ మీడియాని షేక్ చేస్తున్న హీరోయిన్ శ్రీ రెడ్డి కాస్టింగ్ కౌచ్ గురించి అచ్చ తెలుగు పచ్చి బూతులతో నానా హంగామా చేసింది. స్టార్ హీరో దగ్గర నుండి ప్రొడక్షన్ మేనేజర్ల దాకా అందరిని వాయించేసింది అమ్మడు. జరిగేది ఎంతన్నది తెలియదు కాని అమ్మడి వర్షన్ కు కొంతమంది తమ గొంతు కలిపారు. ఇక ఆ తర్వాత శ్రీ రెడ్డిని చూసి మాధవిలత కూడా ఇలాంటి హంగామానే చేసింది.

అయితే ఇదంతా తమని తాము ప్రమోట్ చేసుకునేందుకు మాత్రమే అన్న టాక్ కూడా ఉంది. ఖాళీగా ఉన్న స్టూడియోలు ఇలాంటి విషయాల పట్ల చర్చా వేదిక పెట్టడం కామన్ అయ్యింది. మొదట్లో ఆడియెన్స్ కూడా దీనికి సీరియస్ గా రియాక్ట్ అవగా ఇదే అదునుగా తీసుకుని అందరు ఫాలో అవుతుంటే ఇక కేవలం పబ్లిసిటీ కోసమే ఇదంతా అన్న దాన్ని ఒప్పుకోక తప్పలేదు.

ఇక సంచలనాల శ్రీ రెడ్డి కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడాల్సిందంతా అయ్యిందనుకుంటా ఇప్పుడు టాలీవుడ్ లో తనకు ఇస్టమున్న హీరో గురించి ప్రస్థావిస్తుంది. యాంకర్ టాలీవుడ్ హీరోల్లో ఎవరితో డేట్ కు వెళ్తారని అడుగగా క్షణం ఆలోచించకుండా అల్లు అర్జున్ అనేసింది శ్రీ రెడ్డి. ఆయన ఎనర్జీ సూపర్ అని.. ఆయనతో డేటింగ్ కు తాను ఎల్లవేళలా సిద్ధమే అంటుంది శ్రీ రెడ్డి. అంతేకాదు తన మెంటాలిటీ బన్ని మెంటాలిటీ దగ్గరగా ఉంటుందని అంటుంది. మరి ఈ సంచలనాల శ్రీ రెడ్డి కోరికను బన్ని తీరుస్తాడా లేదో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news