Moviesడౌటే లేదు ఫిదా నడిపించింది పవన్ కళ్యాణే..!

డౌటే లేదు ఫిదా నడిపించింది పవన్ కళ్యాణే..!

టైటిల్ చూసి కాస్త కన్ ఫ్యూజ్ అవ్వొచ్చు.. ఫిదాకు పవన్ కు అసలు సంబంధమే లేదు కదా మరి ఇప్పుడు ఫిదా హిట్ కు పవర్ స్టార్ కు ఎలా లింక్ కుదిరింది అంటే అసలు ఫిదా దర్శకుడు శేఖర్ కమ్ముల ఆ కథను రాసుకుంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసమే అట. ఖుషి సినిమా రిఫరెన్స్ తో పవన్ కు ఫిదా సూట్ అవుతుందని అనుకున్నాడట.

అయితే దిల్ రాజు పవన్ కు కాకుండా వరుణ్ తేజ్ తో సినిమా తీయించారని అంటున్నాడు. పవన్ కు ఈ కథ చెప్పే అవకాశం రాలేదని. కాకపోతే ఇదే కథ మహేష్ కు వినిపించగా సున్నితంగా తిరస్కరించాడట.. ఇక రాం చరణ్ కు కూడా ఫిదా కథ చెప్పగా తన కన్నా వరుణ్ కు అయితే ఇది పర్ఫెక్ట్ అని సలహా ఇచ్చాడట. అలా ఫిదా వరుణ్ తేజ్ దగ్గరకు వచ్చింది.

సినిమా రిలీజ్ అయిన మొదటి షో నుండి హిట్ టాక్ తెచ్చుకున్న ఫిదా వరుణ్ తేజ్ కెరియర్ లో బ్లాక్ బస్టర్ మూవీ అయ్యింది. ఇన్నాళ్లు కెరియర్ లో కమర్షియల్ సక్సెస్ కోసం ఎదురుచూసిన వరుణ్ తేజ్ కు ఈ సినిమా అదిరిపోయే హిట్ ఇచ్చింది. మరి ఫిదాలానే వరుణ్ తేజ్ ఈ సక్సెస్ జోష్ కంటిన్యూ చేస్తాడేమో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news