‘ధృవ’ 30 రోజుల వరల్డ్‌వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్.. దాదాపు చివరి రిజల్ట్ ఇదే!

dhruva 30 days worldwide collections report

Dhruva 30 days worldwide collections report is out. This movie has done very well at the worldwide boxoffice especially in Telugu states even in demonitisation days.

రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ ‘ధృవ’ బాక్సాఫీస్ వద్ద తన దూకుడు తగ్గించేసింది. విడుదలైన కొత్తలో కలెక్షన్ల వర్షం కురిపించిన ఈ చిత్రం.. నాలుగు వారాల రన్‌లో కిందకి పడుతూలేస్తూ డీసెంట్ వసూళ్లే రాబట్టింది. ప్రతి వారంలో ఇతర సినిమాలు విడుదలైనా.. అవేవీ ఈ చిత్రంపై అంతగా ప్రభావం చూపకపోవడంతో సత్తా చాటింది. దాదాపు అన్ని ఏరియాల డిస్ట్రిబ్యూటర్లను కొద్దిపాటి లాభాలతో గట్టెక్కేలా చేసింది. ప్రస్తుతం ఐదో వారంలో అడుగుపెట్టిన ఈ చిత్రం.. అంతంత వసూళ్లతోనే నెట్టుకొస్తోంది.

సంక్రాంతి కానుకగా చిరంజీవి (150), బాలయ్య (100) ల మైల్‌స్టోన్ మూవీలైన ‘ఖైదీ నెంబర్ 150’, ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమాలు భారీ అంచనాల మధ్య రిలీజ్ అవుతుండడంతో.. వాటికే అన్ని థియేటర్లు కేటాయిస్తున్నారు. వీటితోపాటు మరో రెండు సినిమాలు కూడా విడుదల అవుతున్నాయి. అంటే.. ఈ సంక్రాంతి నుంచి ఈ సినిమాల హవానే నడుస్తుంది. ‘ధృవ’ని అన్ని థియేటర్ల నుంచి లేపేయడం జరుగుతోంది. దీంతో.. ట్రేడ్ వర్గాలు ఈ మూవీ క్లోజింగ్ కలెక్షన్స్ రిపోర్ట్‌ని రెడీ చేసేశాయి.

ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం.. ఈ చిత్రం 30 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 56.94 కోట్లు కలెక్ట్ చేసింది. అందులో.. కేవలం తెలుగు రాష్ట్రాల నుంచే ఈ సినిమా రూ.41.42 కోట్లు వసూలు చేయడం విశేషం. ఈ చిత్రానికి అన్నిచోట్ల నుంచి పాజిటివ్ టాక్ రావడం వల్లే డిమోనిటైజేషన్ రోజుల్లోనూ ఇంతమొత్తం కలెక్ట్ చేయగలిగిందని ట్రేడ్ నిపుణులు అంటున్నారు. ఏరియాలవారీగా ఈ మూవీ కలెక్షన్ల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి (కోట్లలో)..

నైజాం : 15.4
సీడెడ్ : 6.73
ఉత్తరాంధ్ర : 5.4
ఈస్ట్ గోదావరి : 3.2
వెస్ట్ గోదావరి : 2.82
కృష్ణా : 2.99
గుంటూరు : 3.53
నెల్లూరు : 1.35
టోటల్ ఏపీ+తెలంగాణ : రూ. 41.42 కోట్లు
కర్ణాటక : 6.72
యూఎస్ఏ : 5.5
రెస్టాఫ్ ఇండియా : 1.6
రెస్టాఫ్ వరల్డ్ : 1.7
టోటల్ వరల్డ్ వైడ్ : రూ. 56.94 కోట్లు (షేర్)

More from my site