Moviesబాక్సాఫీస్ పై CM భరత్ దండయాత్ర…

బాక్సాఫీస్ పై CM భరత్ దండయాత్ర…

సూపర్ స్టార్ మహేష్ పొలిటికల్ నేపథ్యంతో వచ్చిన సినిమా భరత్ అనే నేను. కొరటాల శివ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా లాస్ట్ ఫ్రై డే రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇక మొదటి రెండు రోజుల్లోనే 50, 100 కోట్ల గ్రాస్ కలక్షన్స్ తో దూసుకెళ్లిన భరత్ అనే నేను సినిమా 6వ రోజు 130 కోట్ల గ్రాస్ కలక్షన్స్ రీచ్ అయ్యింది.

ఓవర్సీస్ లో 3 మిలియన్ డాలర్స్ కలక్షన్స్ చేరువలో ఉన్న భరత్ అనే నేను తెలుగు రాష్ట్రాల్లో ఒక్క సీడెడ్ ఏరియాలో తప్ప అన్నిచోట్ల మంచి కలక్షన్స్ రాబడుతుంది. మహేష్ స్టామినా ప్రూవ్ చేసేలా భరత్ అనే నేను కలక్షన్స్ ఉండటం విశేషం. బ్రహ్మోత్సవం, స్పైడర్ ఫ్లాపుల ఎఫెక్ట్ ఏమాత్రం పడకుండా సినిమా బాక్సాఫీస్ మీద దండయాత్ర చేస్తుంది.

డివివి దానయ్య నిర్మించిన ఈ సినిమాలో బాలీవుడ్ భామ కియరా అద్వాని హీరోయిన్ గా నటించింది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కూడా సినిమాకు ప్రధాన బలమని చెప్పొచ్చు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news