Moviesరేపు వస్తున్న సినిమాల పరిస్థితి ఏంటి..

రేపు వస్తున్న సినిమాల పరిస్థితి ఏంటి..

శుక్రవారం వచ్చింది అంటే సినిమాల సందడి మొదలైనట్టే. స్టార్ సినిమా రాని వారం అయితే ఇక రెండు మూడు సినిమాలు వచ్చేస్తాయి. మార్చి 30న రంగస్థలం రిలీజ్ అవగా ఏప్రిల్ 20న భరత్ అనే నేను సినిమా వచ్చింది. మధ్యలో వచ్చిన ఛల్ మోహన్ రంగ, కృష్ణార్జున యుద్ధం అటు ఇటుగా ఆడాయి. లాస్ట్ వీక్ భరత్ రిలీజ్ అవగా ఇప్పటికి బాక్సాఫీస్ పై తన మార్క్ చూపిస్తున్నాడు.

ఇక రేపు శుక్రవారం మంచు విష్ణు ఆచారి అమెరికా యాత్ర, నాగ శౌర్య సాయి పల్లవిల కణం రిలీజ్ అవుతున్నాయి. మంచు విష్ణు, బ్రహ్మానందం ల కామెడీ హైలెట్ గా ఆచారి వస్తున్నాడు. విష్ణు, బ్రహ్మి కామెడీ క్లిక్ అయితే సినిమా హిట్ అయినట్టే. ఇక సాయి పల్లవి ప్రధాన పాత్రగా కణం అంటూ ఓ థ్రిల్లింగ్ కథతో వస్తున్నారు.

కణం సినిమాకు అంతగా బజ్ ఏర్పడలేదు. ఆచారి ప్రమోషన్స్ చేస్తున్నా రేపు మొదటి షో పడ్డాక కాని టాక్ ను బట్టి ప్రేక్షకులు సినిమా మీద దృష్టి పెట్టే అవకాశం ఉంది. ఓ పక్క రంగస్థలం ఇంకా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుండగా భరత్ బీభత్సం సృష్టిస్తుండగా రాబోతున్న ఈ రెండు సినిమాల పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news