షాకింగ్ ట్విస్ట్.. ‘శాతకర్ణి’ సినిమాలో యాంకర్ అనసూయ!

anchor anasuya voice over farah karimi role gautamiputra satakarni

Do you know, Anchor Anasuya also a part of Gautamiputra Satakarni. Yes, this is true. But she will not shown onscreen. She just gave her voice over to Farah Karimi’s role. After searching many artists, director Krish finally approaches Anasuya and gave her this offer.

అవును.. మీరు చదువుతోంది అక్షరాల వాస్తవం. బుల్లితెరపై తన మాటల గారడితో కట్టిపడేసే యాంకర్ అనసూయ.. బాలయ్య ప్రతిష్టాత్మక వందోచిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’లాంటి చారిత్రాత్మక చిత్రంలో భాగం అయ్యింది. అయితే.. ఇక్కడో చిన్న మెలిక ఉంది. అదేంటంటే.. ఆమె ఈ సినిమాలో కనిపించదు, కేవలం తన వాయిస్‌ని వినిపిస్తుందంతే!

‘శాతకర్ణి’ మూవీలో ఇండో-గ్రీక్ యోధురాలిగా డచ్ మోడల్ ఫరా కరిమి నటించింది. ఈ పాత్రకు డబ్బింగ్ చెప్పించేందుకు కొంతమంది ఆర్టిస్టులను పరిశీలించారు. అయితే.. క్రిష్ ఫైనల్‌గా యాంకర్ అనసూయకి ఫిక్స్ అయి, ఆమెని సంప్రదించాడు. ఫరా కరిమి పాత్రకి డబ్బింగ్ చెప్పాల్సిందిగా కోరాడు. అతను కోరడమే ఆలస్యం.. ఈ అమ్మడు వెంటనే ఒప్పేసుకుంది. బాలయ్య వందో సినిమాలో తాను భాగం అయ్యే అవకాశాన్ని ఏ మాత్రం వదులుకోవడం ఇష్టం లేని అనసూయ.. వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాను డబ్బింగ్ చెప్పిన పాత్ర సినిమాలో కేవలం 15 నిముషాలు మాత్రమే ఉన్నప్పటికీ.. అది మూవీని టర్న్ చేస్తుందని అనసూయ అంటోంది. ఈ చారిత్రాత్మక సినిమాలో తానూ భాగం అయినందుకు అమ్మడు హర్షం వ్యక్తం చేస్తోంది. ఈ అవకాశం అందించిన క్రిష్‌కి థ్యాంక్స్ చెప్పుకుంది.

మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. అనసూయ ఇలా డబ్బింగ్ చెప్పడం కొత్తేమీ కాదు. గతంలో క్రిష్ దర్శకత్వంలోనే వచ్చిన ‘వేదం’ మూవీలోని హీరోయిన్ దీక్షాసేత్ పాత్రకూ ఆ యాంకరమ్మే డబ్బింగ్ చెప్పింది. ఇప్పుడు ఇన్నాళ్లకు అతను తెరకెక్కించిన హిస్టారికల్ మూవీలోని ఓ చిన్న క్యారెక్టర్‌ని డబ్బింగ్ చెప్పింది.

More from my site