అఖిల్ కి యూట్యూబ్ అంత షాక్ ఇచ్చిందేంటి ..?

akkineni-akhil
ఎన్నో ఆశలతో  ఎంట్రీ ఇచ్చిన అక్కినేని వారసుడు అఖిల్ కి మొదటి సినిమా గట్టి షాక్ ఇవ్వగా రెండో సినిమాకి మాత్రం యూట్యూబ్ షాక్ ఇచ్చింది. అఖిల్ నటించిన సినిమా టీజర్‌ను యూట్యూబ్‌లో నుంచి తొలగించింది. దీంతో సినిమా యూనిట్ తో పాటు అక్కినేని ఫ్యామిలీ కూడా షాక్ తింది. ఆశలే ఈ సినిమా మీద గంపెడు ఆశలు  పెట్టుకున్నారు. అయితే ఈ సినిమా ను యూట్యూబ్ నుంచి ఎందుకు తొలగించారో తెలియడం లేదు.
ఇటీవల హలో టీజర్ విడుదల చేశారు. ప్రేక్షకుల నుంచి విశేష స్పందన బాగానే  వచ్చింది. దీంతో సినిమాను డిసెంబర్ 22వ తేదీన విడుదల చేసేందుకు అన్నీ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ సమయంలో ఇలాంటి ఊహించని పరిణామం చిత్ర యూనిట్ కి ఎదురయ్యింది. అఖిల్ కథానాయకుడిగా విక్రమ్‌కుమార్‌ దర్శకత్వంలో ‘హలో’ సినిమా వస్తోంది. ‘హలో’ అఫిషియల్‌ టీజర్‌ను వీక్షించేందుకు యత్నించగా అక్కడ ఆ వీడియోను కాపీరైట్ వివాదం కారణంగా తొలగించినట్లు యూట్యూబ్‌ పేర్కొంది.
యాడ్‌రేవ్‌ అనే థర్డ్‌ పార్టీ సంస్థ కాపీరైట్‌ క్లైయిమ్‌ చేయడంతో యూట్యూబ్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏ కాపీరైట్‌ ఉల్లంఘన కారణంగా వీడియోను తొలిగించారనేది మాత్రం ఇంకా తెలియలేదు.
ఎందుకు తొలగించారో తెలియాలంటే హలో సినిమా బృందం స్పందించాల్సిందే. అన్నపూర్ణ స్టూడియోస్‌, మనం ఎంటర్‌ప్రైజెస్‌ సంయుక్తంగా ఈ సినిమాలో కల్యాణి ప్రియదర్శన్ హీరోయిన్‌. అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందిస్తున్నారు.
అయితే ఈ వివాదంపై అఖిల్ స్పందించాడు. ఇప్పటికే ఈ టీజర్‌ను సోషల్ మీడియాలో 8 మిలియన్లకు పైగా చూశారు. ‘హలో’ సినిమా టీజర్‌ కాపీరైట్‌ ఉల్లంఘన అంటూ వస్తున్న ఆరోపణలపై నిర్మాతలుగా స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత మాపై ఉంది. దీనిపై అనవసర రాద్ధాంతం చేయొద్దని అఖిల్ ట్విట్ చేసాడు.

Leave a comment