జనం మెచ్చిన బూతు కథ.. అసలు ఆ వీడియోలో ఏముంది ?

43

ఈ మధ్య చిన్న చిన్న కథలతో కొత్త తారాగణంతో … విడుదల అవుతున్న చిన్న సినిమాలు పెద్ద పెద్ద హిట్టు కొట్టేస్తున్నాయి. ఒక సినిమా మంచి హిట్టు కొట్టాలంటే ముందు ఆ సినిమాకు సంబంధించిన ట్రీజర్ ప్రేక్షకులను ఆకట్టుకోవాలి. అలా అయితే యూట్యూబ్ లో వ్యూస్ పెరిగి ఆ సినిమా విడుదలకు ముందే భారీ అంచనాలు.. మౌత్ పబ్లిసిటీ పెరిగి ఘానా విజయం నమోదు చేసుకుంటుంది. అంతే కాదు… ఆ సినిమాకు భారీ మార్కెట్ కూడా పెరిగి నిర్మాతలకు లాభాల పంట పండిస్తోంది.

అదే ఫార్ములాతో కుర్ర కారును పిచ్చెక్కించేలా చేస్తూ యూట్యూబ్ లో విడుదలయ్యి సంచ‌ల‌నం సృష్టించిన ‘ఏడుచేప‌ల క‌థ’ హ‌క్కులు ఫ్యాన్సీ రేటు పలికాయి. ఈ చిత్రానికి సంభందించి వ‌రల్డ్‌వైడ్ ధియెట్రిక‌ల్ రైట్స్‌ని శ్రీ ల‌క్ష్మి పిక్చ‌ర్స్ బాపిరాజు సొంతం చేసుకున్నాడు. ఇప్ప‌టికే టీజ‌ర్ చూసి ఓక్క‌సారిగా ప్ర‌పంచంలో వున్న తెలుగు ప్రేక్ష‌కులంద‌రూ, ముఖ్యంగా కుర్ర‌కారంతా ఫుల్ ఛార్ట్‌తో యాక్టివేట్ అయ్యారు. ఈ టీజ‌ర్‌కి యూట్యూబ్‌లో అన్ని ఛాన‌ల్స్ క‌లిపి 18 మిలియ‌న్స్ (దాదాపు కొటి ఎన‌భై ల‌క్ష‌ల మంది ) వ్యూస్ రావ‌టం అతిపెద్ద రికార్డు గా నిలవడంతో పాటు… టాలీవుడ్‌లో సంచ‌ల‌నంగా మారింది.

అడల్డ్ కామెడీ జోనర్‌లో పూర్తిగా కొత్త వారితో రూపోందుతున్న ఈ చిత్రంలో అభిషేక్‌ రెడ్డితో పాటు బిగ్ బాస్ ఫేం భాను శ్రీ, ఆయేషా సింగ్, నగరం సునీల్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని చరిత సినిమా ఆర్ట్స్ పతాకం మీద డా.రాకేష్ రెడ్డి గూడూరు సమర్పణలో శేఖర్ రెడ్డి, జివిఎన్ నిర్మిస్తున్నారు. ట్రైలర్ ఈ స్థాయిలో పిచ్చెక్కించేవిధంగా ఉంటే ఇక సినిమా ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకోవచ్చు.

Leave a comment