పబ్లిక్ టాక్ : కర్మ రా బాబు..పరువు తీసాడు..!

8

మెగాస్టార్ అల్లుడు కళ్యాన్ దేవ్ హీరోగా వచ్చిన సినిమా విజేత. రాకేష్ శషి డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాను వారాహి చలన చిత్ర బ్యానర్లో సాయి కొర్రపాటి నిర్మించారు. మురళి శర్మ ముఖ్య పాత్రలో నటించిన ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా పబ్లిక్ టాక్ చూస్తే షాక్ అవుతారు.

మెగా అల్లుడిగా మొదటి ప్రయత్నం చేసిన కళ్యాణ్ దేవ్ ఓవిధంగా సక్సెస్ అయినట్టే అంటున్నారు. సినిమాకు అన్నిచోట్ల పాజిటివ్ టాక్ వస్తుంది. అయితే కళ్యాణ్ దేవ్ ఇంకా డెవలప్ అవ్వాల్సి ఉందని అంటున్నారు. రాకేష్ శషి డైరక్షన్ ఓకే అంటున్నారు. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ బాగుంది. మాళవిక నాయర్ నటన ఆకట్టుకుందని అంటున్నారు.

సినిమా అంతా లిమిటెడ్ బడ్జెట్ లోనే పూర్తి చేశారని.. పాటలు మాములుగానే ఉన్నాయని అంటున్నారు. మొత్తానికి మెగాస్టార్ కోరినట్టుగా మెగా అభిమానులు కళ్యాణ్ ను రిసీవ్ చేసుకున్నట్టే అనిపిస్తుంది. అయితే మొదటి సినిమా ఎలాంటి అంచనాలు లేవు కాబట్టి ఇది హిట్ కొడితే కాని అసలు విషయం ఏంటన్నది తెలుస్తుంది.

Leave a comment