ఎన్టీఆర్‌కు చెమటలు పట్టిస్తు్న్న విజయ్ దేవరకొండ..?

12

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘అరవింద సమేత’పై అటు ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ వర్గాల్లో సైతం భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే ఈ చిత్ర పోస్టర్స్, టీజర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాతో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మరోసారి తన మార్క్‌ వేసేందుకు చూస్తున్నాడు. ఇక దసరా కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు చిత్ర యూనిట్.
2
అయితే తారక్‌కు చెమటలు పట్టిస్తున్నాడు యంగ్ హీరో విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి, గీత గోవిందం సినిమాలతో మోస్ట్ వాంటెడ్ యంగ్ హీరోగా మారిన విజయ్ దేవరకొండ ఇప్పుడు తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై ఫోకస్ పెట్టాడు. ‘నోటా’ అనే పొలిటికల్ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకులను మెప్పించేందుకు రెడీ అవుతున్నాడు ఈ హీరో. కాగా ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ను అక్టోబర్ 4గా ఫిక్స్ చేశారు చిత్ర యూనిట్. ఇప్పుడు ఇదే తారక్‌ అండ్ కో కు ఇబ్బందిగా మారింది. దసరా సమయంలో వచ్చి సక్సెస్ కొడదామనుకున్న ‘అరవింద సమేత’కు నోటా పెద్ద తలనొప్పిని తెచ్చిపెట్టింది. మరోవైపు రవితేజ అమర్ అక్బర్ ఆంటోని, విశాల్ పందెం కోడి 2 సినిమాలు కూడా అక్టోబర్‌ నెలలో రిలీజ్ కానుండటంతో తారక్ అయోమయంలో పడ్డాడు.
1
నోటా చిత్రం తప్పకుండా అరవింద సమేతపై ప్రభావం చూపిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి తారక్ ఈ సమస్యకు ఎలాంటి పరిష్కారం చేస్తాడా అని ఫ్యాన్స్ టెన్షన్‌గా ఎదురుచూస్తున్నారు. మొత్తానికి విజయ్ దేవరకొండ తారక్‌కు చెమటలు పట్టిస్తుండటం ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.
1

Leave a comment