Gossipsమగధీరని మించేలా.. బోయపాటి సినిమా హైలెట్స్..!

మగధీరని మించేలా.. బోయపాటి సినిమా హైలెట్స్..!

రంగస్థలం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినా రాం చరణ్ మగధీర మాత్రం అప్పట్లోనే చరిత్ర సృష్టించింది. ఆ సినిమాలో యాక్షన్ సీన్స్ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్ ఒకేసారి వందమందిని పంపించు అంటూ చరణ్ డైలాగ్ అదిరిపోయింది. ప్రస్తుతం బోయపాటి శ్రీను సినిమాలో కూడా మగధీరని గుర్తుచేసేలా యాక్షన్ సీన్స్ ఉంటాయట.
4
యూరోపియన్ దేశమైన అజర్ బైజాన్ లో ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. అక్కడ రెండు కొండల మధ్య యాక్షన్ సీన్స్ ప్లాన్ చేశారట. ఈ ఫైట్ సీన్స్ సినిమాకే హైలెట్ గా నిలుస్తాయని అంటున్నారు. బోయపాటి శ్రీను సినిమాల్లో యాక్షన్ సీన్స్ ప్రత్యేకంగా ఉంటాయి. అలాంటి బోయపాటి ప్రత్యేకమైన లొకేషన్స్ లో ఈ ఫైట్ సీన్ ప్లాన్ చేయడం సినిమాపై మరింత అంచనాలు పెంచింది.
2
ఇక ధ్రువ, రంగస్థలం వరుస సక్సెస్లతో దూసుకెళ్తున్న రాం చరణ్ ఈ సినిమాతో కూడా హిట్టు కొట్టడం గ్యారెంటీ అనేస్తున్నారు. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో కియరా అద్వాని హీరోయిన్ గా నటిస్తుందట. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాను 2019 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని చూస్తున్నారు.

3

1

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news