Gossipsవిజయ్ దేవరకొండ, రష్మిక.. డియర్ కామ్రేడ్ లో మొత్తం అవేనట..!

విజయ్ దేవరకొండ, రష్మిక.. డియర్ కామ్రేడ్ లో మొత్తం అవేనట..!

టాలీవుడ్ ముద్దుల హీరో విజయ్ దేవరకొండ తను చేసే ప్రతి సినిమాలో హీరోయిన్ పెదాలను రుచి చూడనిది ఒప్పుకోడు. అతను అలా డీసెంట్ గా కనిపించినా ఫ్యాన్స్ చూసేందుకు ఇష్టపడరు. సూపర్ డూపర్ హిట్టైన గీతా గోవిందం సినిమాలో కూడా ముద్దు సీన్ తోనే అసలు రచ్చ మొదలవుతుంది. విజయ్ సినిమాలో ముద్దుల హంగామా కచ్చితంగా ఉండాల్సిందే.. డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన టాక్సీవాలా సినిమాలో కూడా విజయ్ దేవరకొండ లిప్ లాక్ కానిచ్చేశాడు. ఆ సినిమాలో హీరోయిన్ గా నటించిన తెలుగు అమ్మాయి ప్రియాంకా జవల్కర్ కూడా బాగా సపోర్ట్ చేసింది.

ఇదిలాఉంటే ప్రస్తుతం విజయ్ దేవరకొండ చేస్తున్న డియర్ కామ్రేడ్ సినిమాలో కూడా ముద్దులు హద్ధులు దాటేశాయని తెలుస్తుంది. సినిమాలో హీరోయిన్ గా కన్నడ భామ రష్మిక నటిస్తుంది. సినిమాలో స్టూడెంట్ లీడర్ గా నటిస్తున్న విజయ్ దేవరకొండ తన లవర్ తో హాట్ లిప్ లాక్స్ చేస్తాడట. కచ్చితంగా అవి సినిమాకు హైలెట్ గా నిలుస్తాయని అంటున్నారు. విజయ్ దేవరకొండ, రష్మికల జోడీ గీతా గోవిందంలోనే అలరించగా మరోసారి డియర్ కామ్రేడ్ లో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

భరత్ కమ్మ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా హిట్టైతే మాత్రం విజయ్, రష్మికల జోడీకి ప్రత్యేక ఇమేజ్ వచ్చేసినట్టే. కాకినాడ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలో రిలీజ్ కాబోతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news