ఆమె వల్లే నాకు అది వచ్చింది – బిచ్చగాడు హీరో

Vijay Anthony About Ashima Narwal

బిచ్చగాడు సినిమాతో ఒక్కసారిగా టాలీవుడ్ చూపును తనవైపు తిప్పుకున్న హీరో విజయ్ ఆంటోని తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితుడయ్యాడు. ఆ చిత్రం మంచి విజయం సాధించడమే కాకుండా కలెక్షన్ల పరంగానూ దుమ్ములేపింది. కాగా ఈ సినిమా తరువాత వరుసబెట్టి సినిమాలు చేస్తున్నా బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడుతున్నాడు. అయితే తాజాగా ఆయన నటించిన కిల్లర్ చిత్రం రిలీజ్ అయి మంచి పేరు సాధించింది.

అయితే ఈ సినిమా తెలుగులో విజయం సాధించలేదు. కానీ మళయాలంలో ఈ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. కాగా ఈ సినిమా సక్సె్స్ మీట్‌ను ఇటీవల నిర్వహించింది చిత్ర యూనిట్. ఈ సక్సెస్ మీట్‌లో హీరో విజయ్ ఆంటోని ఓ ఆసక్తికర విషయం తెలిపాడు. ఈ సినిమా సక్సెస్‌కు కారణం యాక్షన్ కింగ్ అర్జున్ అని.. తాను రొమాన్స్‌ పండించడంలో బాగా వీక్ అని.. కానీ ఈ సినిమాలో తాను రెచ్చిపోయి రొమాన్స్ పండించడంలో హీరోయిన్ అషిమా నర్వాల్ తనకు బాగా కోఆపరేట్ చేసిందని తెలిపాడు. తాను ఇంత బాగా రొమాన్స్ పండిస్తానని తాను అనుకోలేదని.. హీరోయిన్ తనకు బాగా సహకరించడంతో తాను రొమాన్స్ చేయగలిగాడని తెలిపాడు.

అయితే హీరోయిన్‌ను మరీ ఇంతలా పొగడటంలో ఏదో ఆంతర్యం ఉందని సినీ క్రిటిక్స్‌ చెవులు కొరుక్కొంటున్నారు. ఏదేమైనా హీరో రొమాన్స్‌ చేయడంలో ఆరితేరిపోయాడని క్రిటిక్స్ అంటున్నారు.

Leave a comment