Gossips" వీర భోగ వసంత రాయలు " ట్రైలర్ రివ్యూ :...

” వీర భోగ వసంత రాయలు ” ట్రైలర్ రివ్యూ : ట్రైలర్ లో అదే మైనెస్ కాబోతోందా…?

ఒక సినిమా మీద ముందుగానే అంచనాలు పెంచడానికి ట్రైలర్ విడుదల చేసిన హైప్ క్రియేట్ చేస్తుంటారు. అయితే ఆ ట్రైలర్ లో ఏ లోపాలు లేకుండా చూసుకుంటే సినిమా మీద అంచనాలు ఇంకా ఇంకా పెరుగుతాయి. లేకపోతే ఈ సినిమా ఏదో తేడా కొడుతుందే అన్న సందేహం ముందుగానే ప్రేక్షకులకు కలుగుతుంది. ఇక విషయానికి వస్తే.. నారా రోహిత్, శ్రీయ‌, సుధీర్ బాబు, శ్రీవిష్ణు ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న సినిమా ‘వీర‌భోగ వ‌సంత‌రాయులు’

తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ట్రైలర్ ను విడుదల చేశారు. దేశ‌భ‌క్తి నేప‌థ్యంలో సాగుతున్న భిన్న‌మైన క్రైమ్ థ్రిల్ల‌ర్ గా ఇది కనిపిస్తోంది. ఈ చిత్రాన్ని ఇంద్ర‌సేన తెర‌కెక్కిస్తున్నాడు.మార్క్ కే రాబిన్ అందిస్తున్నాడు. ఎస్ వెంక‌ట్ సినిమాటోగ్ర‌ఫీ , బాబా క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై అప్పారావు బెల్ల‌న ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇక ఈ టీజర్ గురించి మాట్లాడుకుంటే… ఎవరో ఒక గుర్తు తెలియని వ్యక్తి అమ్మాయిలను కిడ్నప్ చేయడం … విమానాన్ని హైజాక్ చేయడం ఆ కేసును ఈ ప్రధాన పాత్రల్లో ఉన్న నటులు టేకప్ చేయడం అనే కోణంలో కనిపిస్తోంది. ఈ సినిమా లో సుధీర్ బాబు పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తున్నాడు. ఇందులో ఆయన గొంతు మార్చారు. కానీ ఆయనకు ఆ డబ్బింగ్ అంతగా సెట్ కాలేనట్టుగా కనిపిస్తోంది. అదే ఈ సినిమాకు ఆయన పాత్రకు పెద్ద మైనెస్ గా మారే అవకాశం కనిపిస్తోంది.

ఇక మరో హీరో నారా రోహిత్ ఒక చేతికి కట్టుతో కనిపిస్తూ … కిడ్నాపర్ కోసం వెతుకుతున్న క్రైమ్ బ్రాంచి హెడ్ పాత్రలో.. సుధీర్ బాబు మిస్ అయిన అడపిల్లల ఆచూకీని కనుక్కునే పోలీస్ అధికారి పాత్రలో కన్పించారు. మరోవైపు శ్రియ శరణ్ ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ పాత్రలో ఈ కేసుల గురించి అరాలు తీస్తూ కనిపించింది. అక్టోబర్ 26 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

https://youtu.be/KT6875hyV1U

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news