సమంత ” యూటర్న్ ” రివ్యూ & రేటింగ్

34

కన్నడలో సూపర్ హిట్ అయిన యూటర్న్ మూవీని తెలుగులో అదే టైటిల్ రో రీమేక్ చేశారు. పవన్ కుమార్ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో సమంత లీడ్ రోల్ చేసింది. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.

కథ :

టైంస్ న్యూస్ పేపర్ లో పనిచేస్తున్న రచన (సమంత) క్రైం రిపోర్టర్ అయిన రాహుల్ రవింద్రన్ ను పెళ్లి చేసుకుంటుంది. ఓ ఫ్లై ఓవర్ యాక్సిడెంట్ కేసు నేపథ్యంలో ఇన్వెస్టిగేట్ చేసే క్రమంలో రచన పర్సనల్ గా ఇబ్బందులు పడుతుంది. ఆ మర్డర్ చేసింది ఎవరు దానికి రచనకు సంబంధం ఏంటి. పోలీస్ ఆఫీసర్ అది పినిశెట్టి రచనకు ఎలా హెల్ప్ చేశాడు. ఈ మర్డర్ కు భూమికకు సంబంధం ఏంటి అన్నది సినిమా కథ.

నటీనటుల ప్రతిభ :

సమంత తనలోని నవ రసాలను పండించేసింది. ఇన్నాళ్లు కమర్షియల్ సినిమాలకు పరిమితమైన సమంత లీడ్ రోల్స్ గా ఇలాంటి సినిమాలు చేస్తుందని ప్రూవ్ చేసుకుంది. సమంత తన భుజాల మీద ఈ సినిమా నడిపించింది. రాహుల్ రవింద్రన్, ఆది పినిశెట్టి ఆకట్టుకున్నారు. చాలా రోజుల తర్వాత భూమిక సర్ ప్రైజ్ రోల్ లో మెప్పించింది. మిగతా పాత్రలన్ని పరిధి మేరకు నటించి మెప్పించారు.

సాంకేతికవర్గం పనితీరు :

పూర్ణ చంద్ర బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. నికేత్ బొమ్మిరెడ్డి సినిమాటోగ్రఫీ సినిమాకు ప్రధాన ఆకర్షణ అని చెప్పొచ్చు. పవన్ కుమార్ కథ, కథనాలు చాలా గ్రిప్పింగ్ గా ఉన్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా సినిమాకు ఎంత బడ్జెట్ పెట్టాలో అంతా పెట్టేశారు. సినిమా ఎడిటింగ్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది.

విశ్లేషణ :

ఇన్నాళ్లు కమర్షియల్ సినిమాల్లో అలరించిన సమంత. ఫీమేల్ లీడ్ గా చేసిన ప్రయత్నమే యూటర్న్. మర్డర్ మిస్టరీగా వచ్చిన ఈ సినిమా కథ, కథనాలు గ్రిప్పింగ్ తో వచ్చాయి. సినిమా మొదలైన నాటి నుండి ఎండింగ్ వరకు ఆడియెన్స్ క్యూరియాసిటీ మెయింటైన్ చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు.

సినిమాలో సమంత పాత్ర చాలా వేరియేషన్స్ కనిపించేలా ఉంటుంది. రచన పాత్రలో సమంత అదరగొట్టింది. కథని పక్కదారి పట్టించే అనవసరపు కమర్షియల్ హంగులేమి లేకుండా పర్ఫెక్ట్ స్టోరీ, స్క్రీన్ ప్లేతో వచ్చింది యూటర్న్. సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలను మెచ్చే ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుంది.

ప్లస్ పాయింట్స్ :

సమంత

స్క్రీన్ ప్లే

ఎడిటింగ్

మైనస్ పాయింట్స్ :

అక్కడక్కడ స్లో అవడం

కాస్త కన్ ఫ్యూజ్

బాటం లైన్ :

యూటర్న్ సమంత విశ్వరూపం..!

రేటింగ్ : 3/5

Leave a comment