త్రివిక్రమ్ కి మహిళలంటే ఎందుకంత చులకన..!

211

మటల మాంత్రికుడు త్రివిక్రం ఎంత ప్రతిభ కలవాడు అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన మాటల తూటాలతో యువత మనసుని తాకే త్రివిక్రం ప్రస్తుతం ఎన్.టి.ఆర్ తో అరవింద సమేత సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా టైటిల్ లో అరవింద హీరోయిన్ అయ్యి ఉంటుందని తెలుస్తుంది. అయితే తన సినిమాల్లో ఎప్పుడు హీరోయిన్స్ ను అమాయకంగా చూపించే త్రివిక్రం ఈ సినిమాలో హీరోయిన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో టైటిల్ పెట్టడం ఆశ్చర్యకరంగా ఉంది.

తన సినిమాలో హీరోలు మేధావులు, డేరింగ్ కలవాళ్లు, ఇంకా సూపర్ హీరో పవర్ లా చూపించే త్రివిక్రం మొదటి సినిమా నువ్వే నువ్వే నుండి అజ్ఞాతవాసి వరకు హీరోయిన్స్ విషయంలో అన్యాయం చేస్తున్నాడు. తన సినిమా హీరోయిన్ పాత్రలను చూస్తే ఏదో ఉన్నారంటే ఉన్నారు అన్నట్టుగా సైలెంట్ గా.. ఇన్నోసెంట్ గా ఉంటారు. ఈ సందర్భాన్ని ఉదాహరణగా తీసుకుని మహిళలంటే త్రివిక్రం కు ఎందుకు అంత చులకన భావం అని కొందరు అంటున్నారు. మరి రాబోతున్న అరవింద సమేత సినిమాతో అయినా ఈ పద్ధతి మారుస్తాడో చూడాలి.

Leave a comment