బిగ్ బాస్ లో తేజశ్వి రెమ్యునరేషన్.. ఆమె నోటితోనే..!

tejaswi-madivada

మొదటి సీజన్ ఎన్.టి.ఆర్ హోస్ట్ గా చేయడంతో బిగ్ బాస్ పై అందరు మక్కువ పెంచుకున్నారు. సెకండ్ సీజన్ అనుకున్నంత జోష్ కనిపించకున్నా కంటెస్టంట్స్ ఎవరో తెలియకున్నా సరే రెండోరోజు నుండి బిగ్ బాస్ పై ఆడియెన్స్ ఇంట్రెస్ట్ పెరిగింది. ముఖ్యంగా ఇంటి సభ్యులలో సంజనా, తేజశ్వి ఇద్దరు చెరో దారి పట్టడం మిగతా కంటెస్టంట్స్ తో డిఫరెన్సెస్ వస్తున్నాయి.

ఇక నిన్నటి ఎపిసోడ్ లో ఎవరు తనని గమనించడం లేదని తేజశ్వి తన కెరియర్ ఎలా మొదలైందో చెబుతూ సడెన్ గా బిగ్ బాస్ లో ఉంటున్నందుకు రోజుకి ఇంత అనేసింది. ఎలాగు ఎడిటింగ్ చేస్తారు కాబట్టి బిగ్ బాస్ ఆ మాటకు బీప్ వేశారు. నిర్వాహకులు ఈ రష్ వింటూ ఎడిటింగ్ చేస్తున్నారని తెలుస్తుంది. దాదాపు 24 గంటల రష్ కేవలం గంటన్నరకు కుదించడం మాములు విషయం కాదు.

ఆడియెన్స్ షో మీద క్యూరియాసిటీ పెంచుకునేలా గొడవపడిన విషయాలను మాత్రం తప్పకుండా టెలికాస్ట్ చేస్తారు. గడిచిన మూడు రోజుల్లో ఎవరు హోమ్ సిక్ ఫీలైనట్టు లేరు.. బిగ్ బాస్ కంటెస్టంట్స్ కు మాత్రమే కాదు ఆడియెన్స్ కు అలవాటుగా మారిందని చెప్పొచ్చు.

Leave a comment