Moviesతేజ్ (I LOVE U) సెన్సార్ రివ్యూ ..!

తేజ్ (I LOVE U) సెన్సార్ రివ్యూ ..!

మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ హీరోగా కరుణాకరణ్ డైరక్షన్ లో తెరకెక్కిన సినిమా తేజ్ ఐలవ్యూ. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ లో కె.ఎస్ రమారావు నిర్మించిన ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. జూలై 6న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ బాగానే చేస్తున్నారు.

ఇక ఈరోజు సినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది. లవ్ స్టోరీగా వస్తున్న ఈ సినిమా సెన్సార్ సభ్యుల నుండి కూడా పాజిటివ్ రెస్పాన్స్ అందుకుందట. ఈ సినిమాకు క్లీన్ యు సర్టిఫికెట్ ఇచ్చారట సెన్సార్ సభ్యులు. వరుసగా 5 సినిమాలు ఫ్లాప్ అందుకున్న తేజ్ ఈ సినిమాతో తప్పకుండా హిట్ కొట్టాలని చూస్తున్నాడు. తేజ్ ఐలవ్యూ తేజూని అందరు ప్రేమించేలా చేస్తుందా లేదా అన్నది చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news