అక్కడ రెచ్చిపోయిన తాప్సీ ..!

Tapsee

తెలుగు నాట పెద్ద‌గా స‌క్సెస్ కాలేక‌పోయిన తాప్సీ బాలీవుడ్లో మాత్రం దూసుకుపోతోంది. వ‌రుస విజ‌యాలు అందుకుని స‌త్తా చాటుతోంది. అందాల ఆర‌బోత‌కి నో చెప్పక‌పోవ‌డం, గాఢ చుంబ‌న దృశ్యాల‌కు ఎటువంటి కండీష‌న్లు పెట్ట‌క‌పోవ‌డం ఆమెకు క‌లిసొచ్చిన అంశాలు. తాజాగా ఆమె చేసిన జడ్వా 2 వ‌సూళ్ల ప్ర‌భంజనం సృష్టిస్తోంది. మ‌న తెలుగు సినిమా హ‌లో బ్ర‌ద‌ర్ కి సీక్వెల్ గా రూపొందిన ఈ సినిమా 200 కోట్ల క్ల‌బ్ లో చేరిపోయింది.

బాలీవుడ్‌ హీరో వరుణ్‌ధావన్‌ ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రం సెప్టెంబరు 29న విడుదలైంది.విమర్శకులు, ప్రముఖుల ప్రశంసలు అందుకుంది. తొలిరోజున దేశవ్యాప్తంగా రూ.16.10 కోట్లు రాబట్టి.. ఈ ఏడాది తొలిరోజున అత్యధిక వసూళ్లు రాబట్టిన నాలుగో చిత్రంగా (హిందీలో) నిలిచింది. మూడు రోజుల్లోనే రూ.50 కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టింది.కాగా ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.200 కోట్లు రాబట్టినట్లు బాలీవుడ్‌ వర్గాల సమాచారం.

దేశవ్యాప్తంగా రూ.163.54 కోట్లు(గ్రాస్‌), విదేశాల్లో రూ.36.64 కోట్లు(గ్రాస్‌) మొత్తం ప్రపంచ వ్యాప్తంగా రూ.200.18 కోట్లు(గ్రాస్‌) రాబట్టినట్లు తెలుస్తోం ది. తాప్సీ బికినీ అందాలు, జాక్వ‌లైన్ స్కిన్ షో , డేవిడ్ థావ‌న్ టేకింగ్ ఇలా అన్నీ అన్నీ క‌లిసొచ్చి సినిమాను క‌మ‌ర్షియ‌ల్ హిట్ చేశాయి.

Leave a comment