శ్యామల ఎలిమినేషన్ కి తన కొడుకే కారణమా..!

41

బిగ్ బాస్-2 నుండి అనూహ్యంగా బయటకు వచ్చిన యాంకర్ శ్యామల నాల్గవ వారం నాటకీయ పరిణామాల మధ్య ఆమెను ఎలిమినేట్ చేశారు బిగ్ బాస్. దీప్తి, నందిని, శ్యామల ముగ్గురిలో ఇద్దరిని సేఫ్ చేయమని కౌశల్, తేజశ్వినికి ఇవ్వగా దీప్తి, నందినిలను సేఫ్ చేశారు. అయితే బయటకు వచ్చిన శ్యమలా ఆడియెన్స్ మనసులను గెలుచుకుంది.

బిగ్ బాస్ నుండి బయటకు రాగానే తన 11 నెలల బాబుతో కలిపి దిగిన పిక్ తో ఫేస్ బుక్ లో కామెంట్ పెట్టింది. బై బై బిగ్ బాస్.. ఇట్స్ టైం టూ ఇషాన్.. బిగ్ బాస్ లో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉందని అన్నది. ఇక తనని సపోర్ట్ చేసిన వారికి థ్యాంక్స్ అంటూ తనని హేట్ చేసిన వారికి ప్రేయర్స్ అంటూ మెసేజ్ పెట్టింది.

శ్యామలకు నెటిజెన్లు సపోర్ట్ గా ఉన్నారు. వేరే వాళ్ల బదులు మిమ్మల్ని నామినేట్ చేశారని మళ్లీ మీరు బిగ్ బాస్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వాలని నెటిజెన్లు ట్రోల్ చేస్తున్నారు.

Leave a comment