Gossipsచిన్మయి న్యూడ్ పిక్స్ పంపమన్న నెటిజెన్.. చెంప చెళ్లుమనేలా ఆన్సర్ ఇచ్చిన...

చిన్మయి న్యూడ్ పిక్స్ పంపమన్న నెటిజెన్.. చెంప చెళ్లుమనేలా ఆన్సర్ ఇచ్చిన అమ్మడు..!

ఈమధ్య సోషల్ బ్లాగ్స్ లో సెలబ్రిటీస్ చిట్ చాట్ లో శృతిమించిన కామెంట్స్ ఎక్కువయ్యాయి. పబ్లిక్ ఫోరంలో ఉన్నాం కాస్త పద్ధతిగా మసలు కోవాలన్న కనీస ఇంగిత జ్ఞానం కూడా ఉండట్లేదు కొందరికి. పొద్దస్థమానం పని పాట లేకుండా ఆన్ లైన్ లో సొల్లేసుకుంటూ కూర్చునే వారికి కొన్ని నెగటివ్ థాట్స్ కూడా వస్తుంటాయి. ఇదిలాఉంటే సెలబ్రిటీస్ మెసేజ్ పంపించే సౌకర్యం వచ్చినందుకు సంతోషపడాలి కాని దాన్ని దుర్వినియోగం చేయకూడదు.

ఈమధ్య సెలబ్రిటీస్ మీద చెత్త కామెంట్స్ ఎక్కువయ్యాయి. వాటిలోనే సింగర్ చిన్మయికి ఎదురైంది. ఓ నెటిజెన్ చిన్మయికి తన న్యూడ్ పిక్స్ పంపించమని డైరెక్ట్ గా మెసేజ్ పెట్టాడు. దానికి ఆమె న్యూడ్ పిక్స్ అనే బ్రాండ్ కు సంబందించిన కొన్ని లిప్ స్టిక్ ఫోటోలు పంపించింది. ఆ ఫోటోలు పంపించి అతనికి చెంప చెళ్లు మనిపించే ఆన్సర్ ఇచ్చింది చిన్మయి.

ఈమధ్య తమిళ రచయిత వైరముత్తు మీద గొడవకు దిగిన చిన్మయి అక్కడ సింగర్ గా అవకాశాలను కోల్పోయింది. డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా ఆమె సినిమాలకు డబ్బింగ్ చెప్పే అవకాశం ఇవ్వట్లేదని తెలుస్తుంది. అయితే తెలుగులో చిన్మయికి ఎలాంటి అభ్యంతరాలు లేవు. ఆమె సమంతకు తెలుగు డబ్బింగ్ చెబుతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news