Gossipsకాజల్ కి షాక్.. ‘సీత’అప్పుడే రాదట..!

కాజల్ కి షాక్.. ‘సీత’అప్పుడే రాదట..!

టాలీవుడ్ లోకి లక్ష్మీ కళ్యానం సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది కాజల్. ఈ సినిమాకు తేజ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో డీ గ్లామర్ గా కనిపించినా..కాజల్ తర్వాత గ్లామర్ డోస్ పెంచేసింది. వరుసగా స్టార్ హీరోల సరసన ఛాన్సులు దక్కించుకుంది. గ్లామరస్ పాత్రలతోనే యూత్ హృదయాలను కొల్లగొట్టేస్తూ వస్తోన్న కాజల్, ఇక నయనతార .. అనుష్క .. త్రిష బాటలో నడవడానికి సిద్ధమైపోయినట్టుగా కనిపిస్తోంది.

ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు మంచి ఆదరణ లభిస్తుంది. ఈ నేపథ్యంలో కాజల్ కూడా లేడీ ఓరియెంటెడ్ పాత్రలో నటించడానికి సిద్దమైంది. తేజ దర్శకత్వంలో ‘సీత’ అనే సినిమాను చేసింది. కాజల్ జోడీగా బెల్లంకొండ శ్రీనివాస్ చేసిన ఈ సినిమా, విడుదలకి ముస్తాబవుతోంది.

అయితే ఈ సినిమా వచ్చే నెల 25న రిలీజ్ చేయనున్నట్లు ఆ మద్య ఓ ప్రకటనలో తెలిపారు. కానీ ఇప్పుడు రిలీజ్ తేది వాయిదా పడనున్నట్లు ఫిలిమ్ వర్గాల్లో టాక్. కొన్ని కారణాల వలన విడుదల తేదీని వాయిదా వేసుకునే ఆలోచనలో దర్శక నిర్మాతలు వున్నట్టుగా చెప్పుకుంటున్నారు. ఈ విషయంపై అధికారిక ప్రకటన రావలసి వుంది. ఈ మూవీలో విలన్ గా సోనూ సూద్ నటిస్తున్నాడు. సంగీతం రూబెన్స్ అందిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news