అర్జున్ రెడ్డికి బర్నింగ్ స్టార్ షాక్..!

Sampoornesh babu new movie updates

హృదయ కాలెయం సినిమా నుండి బర్నింగ్ స్టార్ గా అవతరించిన సంపూర్ణేష్ బాబు హీరో, కామెడీ పాత్రలు చేస్తూ అలరిస్తున్నాడు. సంపూర్ణేష్ బాబు లేటెస్ట్ మూవీ కొబ్బరిమట్ట రాబోతుంది. ఈ సినిమా ఆడియో వేడుకల్లో అర్జున్ రెడ్డి అదేనండి విజయ్ దేవరకొండ స్టైల్ ఫాలో అవుతూ అందరికి షాక్ ఇచ్చాడు సంపూ.

రౌడీ స్టార్ గా విజయ్ దేవరకొండ తెలుగులో సూపర్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్నాడు. అయితే ప్రతి ఈవెంట్ లో తన స్టైల్ తెలిపేలా లుంగీ కల్చర్ అలవరుచుకున్న విజయ్ ను ఫాలో అవుతూ సంపూ కూడా కొబ్బరిమట్ట ఆడియో వేడుకలో లుంగీతో వచ్చాడు. అంతేకాదు ఈ ఆడియో ఈవెంట్ లో బిగ్ బాస్ సీజన్ 1 కంటెస్టంట్స్ 15 మంది వచ్చేలా ప్లాన్ చేశాడు.

బిగ్ బాస్-2 ఫైనల్ వీక్ కు వచ్చేయగా సీజన్ 1 కంటెస్టంట్స్ ను గుర్తు చేస్తూ తన సినిమాకు ఈ విధంగా క్రేజ్ వచ్చేలా చేస్తున్నాడు సంపూర్ణేష్ బాబు. విజయ్ స్టైల్.. బిగ్ బాస్ క్రేజ్ ఇలా తన ప్రయత్నాలన్ని చేస్తూ కొబ్బరి మట్ట సినిమాను ప్రమోట్ చేస్తున్న సంపూర్ణేష్ బాబు ఈ సినిమాతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.

Leave a comment