కొత్త పెళ్లికూతురు చెప్పిన ముచ్చ‌ట్లేటంటే…

Samantha

మేడ్ ఫ‌ర్ ఈచ్ అద‌ర్ అన్న‌ది అంద‌రికీ తెల్సిన మాట‌.. ఇది  నాగ చైత‌న్య – స‌మంత‌ల‌కూ వ‌ర్తిస్తుంది. అంగ‌రంగ వైభ‌వంగా ఇటీవ‌ల వివాహ బంధంతో ఒక్క‌టైన ఈ జంట త్వ‌ర‌లో విందు ఇవ్వ‌బోతోంది. రిస్పెప్ష‌న్ కు సంబంధించి ఏర్పాట్లూ జ‌రుగుతున్నాయి.

ఈ నేప‌థ్యంలో స‌మంత ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ మా ఇద్ద‌రి ఊహల్లో ఆలోచనల్లో తమకు ఏనాడో పెళ్లి అయిపోయింది, కుటుంబ స‌భ్యుల ఆనందం కోసం, సంప్రదాయం కోసమే పెళ్లి జరిగిందని తెలిపింది. గోవాలో హిందూ, క్రైస్తవ సంప్రదాయాల్లో తమ పెళ్లి జరగడం కేవలం శాస్త్రోక్తమే అని చెప్పింది.అదేవిధంగా పెళ్లికి ఎవరినీ పెద్దగా ఆహ్వానించకపోవడానికి కారణాన్ని కూడా సమంత చెప్పింది.

కేవలం తమకు బాగా దగ్గరైన వాళ్ల మధ్యన మాత్రమే పెళ్లి చేసుకోవాలని తను అనుకున్నాను అని, చైతూ కూడా అలాగే అనుకున్నాడని.. అందుకే పెళ్లి పూర్తిగా ప్రైవేట్ ఎఫైర్ అయ్యిందని పేర్కొంది.ఇదిలా ఉంటే నాగ్ స‌మంత న‌టించిన రాజు గారి గది ఈ దీపావ‌ళి కానుక‌గా అక్టోబ‌ర్ 13న విడుద‌ల కానుంది.

 

Leave a comment