Gossipsఆ డైరక్టర్ తో సాయి పల్లవి లవ్.. పెళ్ళికి సిద్ధం..!

ఆ డైరక్టర్ తో సాయి పల్లవి లవ్.. పెళ్ళికి సిద్ధం..!

తెలుగు, తమిళ భాషల్లో వరుస అవకాశాలతో దూసుకెళ్తున్న సాయి పల్లవి ప్రేమలో పడిందన్న వార్తలు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. కోలీవుడ్ డైరక్టర్ ఏ.ఎల్.విజయ్ తో సాయి పల్లవి పీకల్లోతు ప్రేమలో ఉందని త్వరలో వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని తమిళ మీడియా వార్తలు రాస్తుంది. అయితే ఈ వార్తలపై సాయి పల్లవి స్పందించలేదు కాని సాయి పల్లవి ఫ్యాన్స్ మాత్రం ఫైర్ అవుతున్నారు.

ఆల్రెడీ అమలా పాల్ ను ప్రేమించి పెళ్లాడి.. రెండేళ్లు కాపురం చేసి విడిపోయిన విజయ్ తో సాయి పల్లవి పెళ్లంటూ వార్తలు రావడంపై సాయి పల్లవి ఫ్యాన్స్ చాలా సీరియస్ గా ఉన్నారు. అసలు లైఫ్ లో పెళ్లి చేసుకోనని చెబుతున్న సాయి పల్లవిని డైరెక్టర్ తో లింక్ పెట్టడం ఏమాత్రం కరెక్ట్ కాదని చెబుతున్నారు. తన ఫోకస్ మొత్తం సినిమాల మీద పెట్టిన సాయి పల్లవి ఈ రూమర్స్ పై ఎలా స్పందిస్తుందో చూడాలి.

విజయ్ డైరక్షన్ లో సాయి పల్లవి కణం సినిమా చేసింది. ఆ సినిమా టైంలో ఇద్దరి మధ్య చనువు పెరిగిందని.. త్వరలోనే ఇద్దరు పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యారని కోలీవుడ్ మీడియా వార్తలు రాస్తుంది. మరి ఈ వార్తలపై సాయి పల్లవి స్పందన ఎలా ఉంటుందో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news